Advertisement

Advertisement


Home > Politics - Gossip

ఐఎఎస్ కక్కుర్తి-మెగాకు ఇబ్బంది

ఐఎఎస్ కక్కుర్తి-మెగాకు ఇబ్బంది

మెగా ఇంజనీరింగ్ సంస్థ...రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశంలోనే అనేక ప్రతిష్టాత్మక నిర్మాణ ప్రాజెక్టులను చేపట్టిన సంస్థ. వేల కోట్ల టర్నోవర్. మీడియాతో సహా అనేక రంగాల్లో వ్యాపారాలు. పార్టీలతో సంబంధం లేకుండా, రాజకీయాలతో సంబందం లేకుండా స్నేహ బంధాలు. అలాంటి సంస్థ ఇప్పుడు అడ్డంగా దొరకిపోయింది. అసలే కేసిఆర్ కు భాజపాకు మధ్య సంబంధాలు అంతంత మాత్రంగా వున్నాయి. 

ఎక్కడ ఏ పార్టీకి ఆర్థిక మూలాలు వుంటే అక్కడ కన్నేసి, దెబ్బతీయడం అన్నది భాజపా ఉపాయంగా మారింది. ఈమేరకు ఇప్పటికే మెగా ఇంజనీరింగ్ సంస్థ మీద కేంద్ర సంస్థల కన్ను పడిందన్న వార్తలు వుండనే వున్నాయి. దీనికి తోడు ఐఎఎస్ అధికారుల్లో రెండు మూడు రకాల లాబీలు వుండనే వున్నాయి. ఈ లాబీల పుట్టుక ఇవ్వాళ, నిన్న జరిగింది కాదు. దశాబ్దాల కాలంగా ఐఎఎస్ ల నడుమ ప్రాంతాల, కులాల లాబీలు వుండనే వున్నాయి.

ఒకరి కన్నాలు మరొకరు బయటపెట్టి, ఒకరి కాళ్లు మరొకరు లాగడం అన్నది చాలా కామన్. ఇవన్నీ తెలిసి కూడా మెగా ఇంజనీరింగ్ సంస్థ, ఐఎఎస్ అధికారి రజిత్ కుమార్ అడ్డగోలుగా వ్యవహరించి అడ్డంగా దొరికిపోయినట్లు తెలుస్తోంది. ఇందులో అధికారిక రాజకీయాలు వుండనే వున్నాయని అర్థం అవుతూనే వుంది. 

లేదూ అంటే ఎక్కడో నార్త్ లో వున్న ఓ మీడియాకు ఇక్కడి వ్యవహారాలు అన్నీ ఉప్పు ఎవ్వరు అందిస్తారు? శోధనకు ఎవ్వరు సహకరించి కావాల్సిన 'మెటీరియల్' అందిస్తారు? చదువుకుంటే వున్నమతి పోయిందన్న చందంగా వ్యవహరించారు అందరూ.

ఇంతోటి పెళ్లి నిర్వహణకు, హోటళ్ల ఏర్పాట్లకు ఎంత ఖర్చయి వుంటుంది. మహా అయితే పదుల కోట్లలో అయి వుంటుంది. ఒక్కో భోజనం 16 వేల వంతున 70 మందికి అంటే ఎంత? మహా అయితే మరో అంత మందికి మాత్రమే గదులు బుక్ చేసి వుంటారు. పెళ్లి మండపం బుక్ చేసి వుంటారు. ఇవన్నీ కలిసి పట్టుమని పది కోట్లు కూడా దాటి వుండకపోవచ్చు.

ఎవరో ఒకరు కన్నేస్తారని తెలియదా? ఓ కీలక ఐఎఎస్ అధికారికి ఆ మాత్రం ఆలోచన వుండాలి కదా? బహుశా అధికార పార్టీ అండదండలున్నాయనే ధీమా మరీ ఎక్కువయిపోయి వుండొచ్చు. మెగా ఇంజనీరింగ్ తో నేరుగా కాకపోయినా పరోక్షంగా సంబంధాలున్న సంస్థ ద్వారా చెల్లింపులు, బుకింగ్ లు జరిగాయి. మెగా సంస్థలో పని చేసే ఉద్యోగి కేవలం ఈ పని కోసం ఓ మెయిల్ ఐఢి సృష్టించారు. అంతవరకు బాగానే వుంది. కానీ ఆయన తన పేరే నేరుగా వాడారు. 

మెగా సంస్థ లీగల్ గా తప్పించుకోవచ్చు. ఆ ఉద్యోగి వ్యక్తిగత హోదాలో ఇవన్నీ చేసారు అని బుకాయించవచ్చు. అది పెద్ద విషయం కాదు. కానీ ఆ ఐఎఎస్ అధికారి మాత్రం ఏం చెబుతారు. తన కుమార్తె పెళ్లికి తను చేసిన చెల్లింపులు చూపించాలి కదా? తన కుమార్తె పెళ్లికి వేరే డొల్ల కంపెనీలు ఎందుకు చెల్లింపులు చేసాయి అన్నదానికి ఆయన సంజాయిషీ ఇచ్చుకోవాలి కదా?

గోటితో పోయేదానికి గొడ్డలి తెచ్చుకోవడం అంటే ఇదే. పది, పదిహేను కోట్లతో పోయే దాన్ని అంత సంపన్న ఐఎఎస్ కూడా కక్కుర్తి పడితే వ్యవహారం ఇలాగే వుంటుంది. ఇప్పుడేమయింది చీఫ్ సెక్రటరీగా పదోన్నతి పొందడానికి ఈ కక్కుర్తి అడ్డం పడుతోంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?