చాలా రకాలుగా కంట్రోలింగ్ సాధ్యం!

మద్యం దుకాణాలను ప్రభుత్వమే నిర్వహించడానికి పూనుకుంది. రాష్ట్రంలో వచ్చే అయిదేళ్లలో సంపూర్ణ మద్యనిషేధం అమల్లోకి తీసుకురావాలని సంకల్పిస్తున్న ప్రభుత్వం.. ఆ దిశగా వేస్తున్న తొలి అడుగుగా దీనిని భావించాల్సి ఉంటుంది. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న…

మద్యం దుకాణాలను ప్రభుత్వమే నిర్వహించడానికి పూనుకుంది. రాష్ట్రంలో వచ్చే అయిదేళ్లలో సంపూర్ణ మద్యనిషేధం అమల్లోకి తీసుకురావాలని సంకల్పిస్తున్న ప్రభుత్వం.. ఆ దిశగా వేస్తున్న తొలి అడుగుగా దీనిని భావించాల్సి ఉంటుంది. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న వాటిలో.. 880 దుకాణాలను తొలగించారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో కేవలం 3500 దుకాణాలు మాత్రం నడుస్తాయి. కాంట్రాక్టు పద్ధతిన నియమితులయ్యే ఉద్యోగులే ఇక్కడ పనిచేస్తారు.

మద్యం సిండికేట్లు ప్రభుత్వాలను శాసించే పరిస్థితి ఇన్నాళ్లూ ఉండేది. ఇలాంటి అరాచకాలు అన్నింటికీ ఇకపై చెక్ పెట్టబోతున్నారు. ప్రెవేటు దుకాణాలు ఉన్నంత కాలమూ.. ప్రతిచోటా సిండికేట్లు ఏర్పడి టెండర్లను శాసించడం జరిగేది. ఒకవైపు ప్రభుత్వ ఖజానాకు చిల్లు పెట్టడం మాత్రమే కాకుండా, మరోవైపు మద్యం అక్రమ వ్యాపారాన్ని కూడా విచ్చలవిడిగా సాగిస్తుండేవారు. ఈ రెండు రకాల దోపిడీలకు ప్రభుత్వమే దుకాణాలు నిర్వహించే కొత్త పద్ధతి ద్వారా చెక్ పెట్టబోతున్నారు.

మద్యం దుకాణాల సంగతి ఎలా ఉన్నప్పటికీ… బెల్టు షాపులనేవి సామాజిక జీవనాన్ని ఎంతగా సర్వనాశనం చేసేస్తూ వచ్చాయో అందరికీ తెలుసు. ఈ బెల్టు షాపులు పల్లెటూర్లలో స్థానిక నాయకుల దందాలకు నెలవుగా మారడంతో.. గత ప్రభుత్వాలు కూడా వీటి గురించి పట్టించుకోలేదు. బెల్టు షాపులను తీసేస్తాం అనే ప్రకటనలన్నీ అబద్ధాలుగా నిరూపణ అయ్యాయి.

అయితే పల్లెల్లో ఆడపడచుల కన్నీళ్లకు కారణమౌతున్న బెల్ట్ షాపుల విషయంలో స్థిరమైన హామీ ఇచ్చిన జగన్మోహనరెడ్డి అధికారంలోకి రాగానే వాటికి మంగళం పాడారు. భవిష్యత్తులో కూడా మరో బెల్టుషాపులు ఏర్పాటు కాకుండా ఉండేలా.. నూతన మద్యం పాలసీని తీసుకువచ్చారు. దీనిని ఖచ్చితంగా సంక్షేమం దిశగా అడుగుగానే పరిగణించాల్సి ఉంటుంది.

ప్రభుత్వమే దుకాణాలను నిర్వహించడం వలన దోపిడీని చాలా రకాలుగా అరికట్టడం సాద్యమవుతుంది. ఈ దుకాణాల్లో ఎమ్మార్పీకే విక్రయిస్తారు. పైగా ప్రతి విక్రయానికీ బిల్లు ఇస్తారు. అక్రమ మద్యం, నకిలీ మద్యం విక్రయాలు పూర్తిగా అరికట్టడం సాధ్యమవుతుంది.

అలాగే.. మద్యం సిండికేట్లు ఎక్కువ ధరలకు వేలం పాడుకుని, ఆ మేరకు లాభాలు ఆర్జించడానికి ఎమ్మార్పీకంటె చాలా ఎక్కువ ధరలకు విక్రయిస్తూ దోచుకోవడం జరుగుతూ ఉండేది. అలాంటి దోపిడీలకు కూడా చెక్ పెట్టినట్లవుతుంది. ఇలా కొత్త మద్యం విధానం వల్ల చాలా రకాలుగా నియంత్రణ సాధ్యమవుతుందని నిపుణులు భావిస్తున్నారు.

‘బాహుబలి’ రికార్డ్స్ ను ‘సాహో’ అధిగమిస్తుందా?