
జనసేన వాయిస్‌ను ఆ పార్టీ అధికార ప్రతినిధి బొలిశెట్టి సత్యనారాయణ గట్టిగా వినిపిస్తుంటారు. అలాంటి నాయకుడిని ఆ పార్టీ అనుమానించే పరిస్థితి వచ్చింది. జనసేనకు బొలిశెట్టి అనుకూల శత్రువా? అనే విమర్శ ఆ పార్టీలో లేకపోలేదు. పవన్‌కల్యాణ్‌ను వైసీపీ నేతలు ప్యాకేజీ స్టార్, దత్తపుత్రుడని, బాబు పల్లకీ మోసేవాడని తీవ్రంగా విమర్శిస్తున్నా, చంద్రబాబునాయుడు స్పందించకపోవడంపై బొలిశెట్టి ట్విటర్‌లో పెట్టిన పోస్టు తీవ్ర చర్చకు దారి తీసింది.
టీడీపీతో జనసేన పొత్తు పెట్టుకోవడం బొలిశెట్టికి అసలు ఇష్టం లేదు. ఈ నేపథ్యంలో టీవీ డిబేట్లలో బొలిశెట్టి సత్యనారాయణ టీడీపీ, చంద్రబాబు విధానాలను తూర్పారపడుతున్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీలనివ్వనని పవన్‌కల్యాణ్ చెప్పిన దానికి, పొత్తు కుదుర్చుకోవడం కాదని బొలిశెట్టి సత్యనారాయణ తనదైన రీతిలో కొత్త భాష్యం చెప్పేందుకు ప్రయత్నిస్తున్నారు. చంద్రబాబుపై బొలిశెట్టి విమర్శల్ని పవన్‌కల్యాణ్, నాగబాబు జీర్ణించుకోలేకపోతున్నారని సమాచారం.
బొలిశెట్టి వ్యవహార శైలి జనసేనకు నష్టం తెచ్చేలా వుందనే చర్చ ఆ పార్టీలో నడుస్తోంది. గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న బొలిశెట్టి, ఆ తర్వాత కాలంలో జనసేనలోకి వచ్చారు. చంద్రబాబుతో పాటు టీడీపీపై ఆయన వ్యక్తిగత కక్ష పెంచుకున్నారని జనసేన ముఖ్య నేతలు భావిస్తున్నారు. అందుకే ఆయన పార్టీ విధానాలకు విరుద్ధంగా చంద్రబాబు, టీడీపీ ప్రభుత్వాన్ని తిట్టిపోస్తున్నారని అభిప్రాయపడుతున్నారు.
ఇలాగైతే జనసేనకు బొలిశెట్టి వల్ల నష్టమనే అభిప్రాయంలో ఆ పార్టీ నేతలున్నట్టు సమాచారం. బొలిశెట్టి వైఖరిపై జనసేన సోషల్ మీడియాలో వ్యతిరేక పోస్టులు ప్రత్యక్షం కావడం గమనార్హం.
నేను మొక్కలతో, దేముడితో మాట్లాడుతా