cloudfront

Advertisement

Advertisement


Home > Politics - Gossip

కాపులపై ఆశ వదులుకుంటున్న 'దేశం' ?

కాపులపై ఆశ వదులుకుంటున్న 'దేశం' ?

చేసిన తప్పులు దిద్దుకోవడం తెలివైన పనే. కానీ ఎప్పటికీ తప్పులు చేస్తూ, దిద్దుకుంటూ పోతుంటే అదో ప్రాసెస్ గా మారుతుంది తప్ప, ఒప్పులు చేయడానికీ టైమూ వుండదు, వీలూ కుదరదు. తెలుగుదేశం పార్టీ వ్యవహారం ఇలాగే వుంటోంది. ఒక్కో ఎన్నికకు ఒక్కో స్ట్రాటజీ చేయడం, అది సరి కాదని అనుకోవడం మళ్లీ మార్చుకుంటూ వెళ్లడం ఇదే వ్యవహారం. 

తెలుగుదేశం మొదటి నుంచి బిసిలకు కాసిన్ని ఎమ్మెల్యే పదవులు ఇస్తూ, వారి ఓట్లు సంపాదించి, అధికారం అందుకుంటూ వస్తోంది. 2019 ఎన్నికల ముందుగా మెలమెల్లగా కాపుల వైపు మొగ్గుతూవచ్చింది. ఎందుకంటే అప్పటికే కాపులు వైకాపా వైపు మొగ్గుతున్నారన్న అనుమానం రావడం వల్ల. అందులో భాగంగానే కళా వెంకట్రావుకు పార్టీ అధ్యక్షపదవి ఇచ్చారు. ఆయన అయితే అటు బిసి కోటా కిందకు ఇటు కాపు కోటా కిందకు (ఆయన తూర్చు కాపు కాబట్టి) వస్తారు అని ప్లాన్ చేసారు. 

కానీ బిసిలు చాపకింద నీరు మాదిరిగా దేశానికి దూరం కావడం ప్రారంభించారు. అది గమనించే సరికే వ్యవహారం ముదిరిపోయింది. 2019 ఎన్నికల్లో బిసి లు దారుణంగా దెబ్బ కొట్టారు. అందుకే జగన్ బిసి ల రుణం తీర్చుకోవడానికి వారికి ప్రత్యేక నగదు స్కీములు ప్రవేశ పెట్టారు. 

మరోపక్కన జాతీయ పార్టీ భాజపా కూడా కాపుల మీద దృష్టి పెట్టింది. ఇటు  పవన్ కళ్యాణ్, అటు వీర్రాజుల ద్వారా పార్టీకి కాపుల బలం సమకూర్చే పనిలో పడింది. కచ్చితంగా ఇక కాపుల బలం మూడు కింద చీలాల్సిందే. ఇటు వైకాపా కొంత, అటు తేదేపా కొంత, ఇక జనసేన తనకు సాధ్యమైనంత లాగేస్తాయి. ఇక బిసి ఓట్ బ్యాంక్ అలా కాదు. అది జనసేన వైపు వెళ్లడం తక్కువగా వుంటుంది. అందువల్ల దాన్ని వీలయినంత లాగాలని ఇఫ్పుడు తెలుగుదేశం ప్రయత్నాలు ప్రారంభించినట్లు కనిపిస్తోంది.

తెలుగుదేశం ఇప్పుడు బిసిలను పట్టుకోవడం కోసం ట్రయ్ చేయడం వరకు స్ట్రాటజీ బాగానే వుంది. కానీ ఇలా తడవ తడవ కు స్ట్రాటజీ వేయడం మాత్రం రాజకీయంగా సరియైనది అనుకోదు. అయిదేళ్లకు ఓసారి నేషనల్ స్ట్రాటజీ  మార్చడం అన్నది కామన్ అయిపోయింది. జాతీయ పార్టీలతొ పొత్తు విషయంలోనూ అయిదేళ్లకు ఓసారి ఒక్కో నిర్ణయం, కులాల సమతూకం విషయంలో తడవకు ఓసారి నిర్ణయాలు మార్చుకోవడం, వంటివి చేస్తూ రావడం వల్ల చంద్రబాబు పై ఇటు బిసి లు, అటు కాపులు ఇద్దరి నమ్మకాన్ని చంద్రబాబు కోల్పోతున్నారు. 

మరోపక్కన బిసి ల్లో వివిధ కులాలకు వేర్వేరు కార్పొరేషన్లను ఏర్పాటుచేయాలని జగన్ ఆలోచిస్తున్నారు. అది కనుక చేస్తే ఇక బిసి ల్లో మెజారిటీ కులాలు ఆయనవెంటే వుండే అవకాశం వుంది. కానీ ఎప్పుడయితే తమను వదిలేసి బాబు బిసి ల దగ్గరకు పరుగెడుతున్నారు అన్న ఆలోచన వస్తే ఆ మాత్రం ఈమాత్రం అండగా వున్న కాపులు కూడా దూరం అవుతారు. ఇప్పటికే రెడ్లు, రెడ్లు అని పలవరిస్తూ వారిని దూరం చేసుకున్నారు. న్యూట్రల్ గా వుండే రెడ్లను కూడా ఇలా పదే పదే ఓ వర్గాన్ని టార్గెట్ చేయడం ద్వారా దూరం చేసుకున్నారు. 

ఇవన్నీ ఇలా వుంటే ఇటీవల మరో వ్యవహారం టేకప్ చేసారు. దళితులు కాంగ్రెస్ ను వీడి వైకాపా వైపు వెళ్లారు. వాళ్లను తమ వైపు తిప్పుకోవాలని తెగ ప్రయత్నిస్తున్నారు. ఎక్కడ దళితుల గొడవ ఏ కారణంగా, ఏ వ్యక్తిగత కారణాలతో జరిగినా అదేదో జగన్ తప్పిదమే అన్నట్లు భయంకరంగా ఫోకస్ చేస్తున్నారు.

దీనివల్ల దళితుల ఓటు బ్యాంక్ నుంచి 'దేశం' ఏ మేరకు డ్రా చేయగలుగుతుంది అన్నది పక్కన పెడితే, తరచు ఇలా ఏ స్ట్రాటజీ పడితే ఆ స్ట్రాటజీని మార్చుకుంటూ పోతూ వుంటే వివిధ వర్గాల్లో ఏ వర్గాన్ని సంతృప్తి పరిచే అవకాశం తగ్గుతుంది. ఏ వర్గం కూడా కూడా పూర్తిగా నమ్మకంతో వుండే అవకాశం కూడా వుండదు. 

మొత్తం మీద కులాల సమతూకం విషయంలో చంద్రబాబు ఆలోచనలు ఎప్పటిప్పుడు ఫెయిల్ అవుతున్నాయి. వాటిని మార్చుకుని రిపేర్లు చేస్తుంటే మరింత మైనస్ అవుతోంది.

ప్రస్తుతం ఒక ట్రాప్ లో ఉన్నాను

యధా మోడీ..తథా పవన్

 


×