Advertisement

Advertisement


Home > Politics - Gossip

జగన్ Vs కేసీఆర్.. పట్టుదలకు ఇగోకు తేడా

జగన్ Vs కేసీఆర్.. పట్టుదలకు ఇగోకు తేడా

ఏపీ ముఖ్యమంత్రి జగన్ కీ, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కీ ఒక విషయంలో పోలిక ఉంది. మాట ఇస్తే వెనక్కు తగ్గకపోవడం, ఇబ్బందులు ఎదురైనా అనుకున్న పని చేసితీరడం. ఇద్దరూ ఈ విషయంలో ఒకటే. అయితే ఇద్దరికీ ఇక్కడే ఒక తేడా ఉంది. జనం కోసం జగన్ మడమ తిప్పరు. తన ఇగో కోసం కేసీఆర్ వెనకడుగు వేయరు.

ఏపీలో ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియంపై రభస జరుగుతోంది. వైసీపీ మినహా మిగతా ఏపార్టీ దీనికి మద్దతివ్వడంలేదు. అయినా సరే జగన్ తన నిర్ణయాన్ని అమలుచేయబోతున్నారు. ఎవరు ఎన్ని విమర్శలు చేసినా, ఎంత ఒత్తిడి తెచ్చినా జగన్ మాత్రం వెనక్కు తగ్గలేదు.

ఒకటి నుంచి ఆరో తరగతి వరకు తొలివిడతలో, మిగతా తరగతుల్లో విడతల వారీగా ఇంగ్లిష్ మీడియం ప్రవేశ పెట్టాలని నిర్ణయించారు. కేవలం పేద పిల్లల బాగుకోసమే జగన్ అందరినీ ఎదిరిస్తూ ఈ సాహసోపేత నిర్ణయం తీసుకున్నారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యను సైతం ఈ విషయంలో విభేదించేందుకు, విమర్శించేందుకు వెనకాడలేదు సీఎం జగన్. ఇక్కడ జగన్ ది ఇగో కాదు. ఒక విధంగా మొండి పట్టుదల అనాలి.

ఇక తెలంగాణ ఆర్టీసీ సమ్మె విషయంలో కేసీఆర్ ఎంత కఠినంగా ఉందీ అందరం చూస్తున్నాం. కార్మికులు తగ్గినా కేసీఆర్ వెనక్కు తగ్గలేదు. ఆయన అభిప్రాయం సరైనదే కావచ్చు, కానీ కార్మికుల జీవితాల గురించి మాత్రం ఆలోచించలేకపోతున్నారు. కేవలం తన మాట నెగ్గించుకునేందుకు ఐఏఎస్ అధికారులు సైతం కోర్టులో చీవాట్లు తినేలా చేశారు. కార్మికుల ఆత్మహత్యలు జరుగుతున్నా నిర్దయగా ఉన్నారు, ఆందోళనల్ని అణగదొక్కుతున్నారు. ఇక్కడ కేసీఆర్ ది కూడా మొండి పట్టుదలే. కాకపోతే ఇందులో ఇగో కనిపిస్తోంది.

జగన్ నిర్ణయంతో తెలుగు చచ్చిపోతుందని, తెలుగు భాష మరుగున పడిపోతుందని నానా రాద్ధాంతం చేస్తున్నారు ప్రతిపక్ష నేతలు. మీడియా సైతం యాగీ చేస్తోంది. కానీ జగన్ దేనికీ భయపడటంలేదు, వారి సూచనల నుంచి కొన్ని తన విధానానికి కొన్ని మార్పులు చేసి, వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇంగ్లిష్ మీడియాన్ని పట్టాలెక్కిస్తున్నారు.

ఇక్కడ పేద పిల్లల భవిష్యత్ కోసం జగన్ వెనక్కు తగ్గడం లేదు. అక్కడ ఇగో కోసం కేసీఆర్ వెనక్కు తగ్గడం లేదు. మొండి పట్టుదలలో ఇద్దరూ ఇద్దరే అనిపించుకుంటున్నారు. కానీ ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య తేడా మాత్రం చాలా ఉంది. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?