మనది కాకపోతే కాశీదాకా దేకేద్దాం…

ఏదో సామెత చెప్పినట్టుగా ఉంది చంద్రబాబునాయుడు తీరు.. వ్యవహార సరళి. ప్రభుత్వం మనది కానప్పుడు.. ఎంత లావు సాయమైనా ప్రజలకు చేసేయాల్సిందే అన్నట్టుగా ఆయన ప్రకటనలు గుప్పించేస్తున్నారు. ప్రభుత్వం పేదలకు రెండు నెలలకు సరిపడా…

ఏదో సామెత చెప్పినట్టుగా ఉంది చంద్రబాబునాయుడు తీరు.. వ్యవహార సరళి. ప్రభుత్వం మనది కానప్పుడు.. ఎంత లావు సాయమైనా ప్రజలకు చేసేయాల్సిందే అన్నట్టుగా ఆయన ప్రకటనలు గుప్పించేస్తున్నారు. ప్రభుత్వం పేదలకు రెండు నెలలకు సరిపడా రేషన్ సరుకుల, ఐదువేల రూపాయల నగదు ఇవ్వాలని అంటున్నారు. జగన్ సర్కారు ఇప్పటికే ఒక నెలకు సరిపడా రేషన్ సరుకులు, వెయ్యి రూపాయల నగదు ఇవ్వడానికి నిర్ణయించిన నేపథ్యంలో.. చంద్రబాబు ప్రకటన హాస్యాస్పదంగా ఉంది.

సాధారణగా కమ్యూనిస్టు నాయకులు ఇలాంటి గొంతెమ్మ కోరికలతో కూడిన డిమాండ్లను ప్రభుత్వాలకు వినిపిస్తుంటారు. ఎంత పెద్ద హామీలు అడగడానికైనా వారికి ఎన్నడూ భయం ఉండదు. ఎందుకంటే.. వారు ఎప్పటికీ అధికారంలోకి రారు.. అనే క్లారిటీ వారికి ఉంటుంది. సాధారణంగా ఎవరైనా ఒక డిమాండ్ చేస్తున్నారంటే.. భవిష్యత్తులో తాము అధికారంలోకి వస్తేగనుక అలాగే చేయాల్సి ఉంటుందనే భయం వారిలో ఉంటుంది. కానీ కమ్యూనిస్టులకు అలాంటి భయం ఉండదు. అందుకే ఎడాపెడా డిమాండ్లు చేస్తుంటారు.

ఇప్పుడు చంద్రబాబునాయుడు కూడా అచ్చంగా.. వారి బాటలోనే నడుస్తున్నట్టుంది. ప్రభుత్వం మనది కాదు గనుక.. అయిదువేలేం ఖర్మ.. ప్రతి కుటుంబానికి పదివేల రూపాయలైనా ఇవ్వాలని డిమాండ్ చేసే తరహాలో చంద్రబాబునాయుడు చెలరేగిపోతున్నారు. రెండు నెలలకు సరిపడా రేషన్ సరుకులు ఇవ్వడానికి జగన్ సర్కారు వెనుకాడుతుందని కాదు.. కాకపోతే.. అప్పటిదాకా ఇదే పరిస్థితి ఉంటుందని ఫిక్సయిపోయినట్లుగా ఆ నిర్ణయం ప్రజల్లోకి ఒక భయవిహ్వలమైన సంకేతాలను పంపుతుంది.

ప్రజల్లో భయాందోళనలు పెరుగుతాయి. సామాజిక భయంలోంచి అసహనం, అవాంఛనీయ పరిణామాలు చోటుచేసుకునే ప్రమాదం ఉంటుంది. అందుకే ఒక నెల వరకు ఇలా ప్రకటించారు. తర్వాత ఇదే పరిస్థితి ఉంటే మళ్లీ మరో నెలకు కూడా ఇలా ఇవ్వడం కంటిన్యూ చేస్తారు. అంతే తప్ప.. ప్రజలను భయపెట్టడం ప్రభుత్వాల లక్ష్యం కాకూడదు. ఇలాంటి వివేచన, విచక్షణ లేకుండా చంద్రబాబు మాట్లాడుతున్న మాటలు… ఆయన పరువుకే భంగం కలుగజేస్తాయని ప్రజలు అనుకుంటున్నారు.

బైట తిరిగితే సీరియస్ యాక్షన్