లోకేశ్ ముఖ్య అనుచ‌రుడి నేతృత్వంలో ఆప‌రేషన్ ఆక‌ర్ష్‌!

మంత్రి లోకేశ్ ముఖ్య అనుచ‌రుడినంటూ ఒక‌ వ్య‌క్తి తిరుప‌తికి చెందిన‌ కార్పొరేట‌ర్ల‌ను టీడీపీలో చేర్చే ప‌నిలో ప‌డ్డాడు. అధికారం లేనిదే ఎవ‌రూ రాజ‌కీయాల్లో కొన‌సాగే ప‌రిస్థితి క‌నిపించ‌డం లేదు. అధికార పార్టీలో ఉండ‌డానికే గ‌ల్లీ…

మంత్రి లోకేశ్ ముఖ్య అనుచ‌రుడినంటూ ఒక‌ వ్య‌క్తి తిరుప‌తికి చెందిన‌ కార్పొరేట‌ర్ల‌ను టీడీపీలో చేర్చే ప‌నిలో ప‌డ్డాడు. అధికారం లేనిదే ఎవ‌రూ రాజ‌కీయాల్లో కొన‌సాగే ప‌రిస్థితి క‌నిపించ‌డం లేదు. అధికార పార్టీలో ఉండ‌డానికే గ‌ల్లీ నాయ‌కులు సైతం ఆస‌క్తి చూపుతున్నారు. ఈ నేప‌థ్యంలో కార్పొరేట‌ర్ల‌పై ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్‌కు స‌ద‌రు వ్య‌క్తి శ్రీ‌కారం చుట్టారు. ఈ నేప‌థ్యంలో పార్టీ మార‌ను కుయ్యో మొర్రో అని చెబుతున్న తిరుప‌తి మేయ‌ర్ డాక్ట‌ర్ శిరీష కుటుంబ స‌భ్యుల వ‌ద్ద‌కెళ్లి, తాను లోకేశ్ రెడ్‌బుక్ ప్ర‌తినిధిగా పరిచయం చేసుకున్న‌ట్టు తెలిసింది.

టీడీపీలో చేరాల‌ని ఆ వ్య‌క్తి ఒత్తిడి చేశాడ‌ని స‌మాచారం. అయిన‌ప్ప‌టికీ మేయ‌ర్ మాత్రం పార్టీ మారేది లేద‌ని తేల్చి చెప్పిన‌ట్టు తెలిసింది. మ‌రోవైపు కార్పొరేట‌ర్ల‌ను లోకేశ్ ద‌గ్గ‌రికి తీసుకెళ్లి, టీడీపీలో చేర్పిస్తాన‌ని న‌మ్మ‌బ‌లుకుతున్నాడు. కొంత మంది వైసీపీ కార్పొరేట‌ర్ల‌ను టీడీపీ, జ‌న‌సేనలో చేర్చుకోడానికి సంబంధిత ముఖ్య నాయ‌కులు ఆస‌క్తి చూప‌డం లేదు. అలాంటి నాయ‌కుల్ని ఇటీవ‌ల లోకేశ్ రెడ్‌బుక్ ప్ర‌తినిధి మంత్రి రామ్‌ప్ర‌సాద్‌రెడ్డి ద‌గ్గ‌రికి తీసుకెళ్లాడు.

మ‌ద‌న‌ప‌ల్లెకు చెందిన ఆ వ్య‌క్తి తిరుప‌తి రాజ‌కీయాల్లో చ‌క్రం తిప్పుతుండ‌డంపై స్థానిక టీడీపీ, జ‌న‌సేన నాయ‌కులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. టీవీ డిబేట్ల‌లో క‌నిపిస్తూ, లోకేశ్‌కు ద‌గ్గ‌రి మ‌నిషిగా ప్ర‌చారం చేసుకుంటూ, వైసీపీ కార్పొరేట‌ర్ల‌ను టీడీపీలో చేర్పిస్తాన‌ని బేరాలు ఆడ‌డంపై తిరుప‌తి టీడీపీ, జ‌న‌సేన నాయ‌కులు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ఇలాగైతే తామెందుకు రాజ‌కీయాలు చేయాల‌ని వారు ప్ర‌శ్నిస్తున్నారు.

తిరుప‌తి జ‌న‌సేన‌, టీడీపీ నాయకుల‌కు సంబంధం లేకుండా వైసీపీ కార్పొరేట‌ర్ల‌ను నేరుగా మంత్రుల‌తో క‌లుపుతుంటే ప్రేక్ష‌క‌పాత్ర పోషించాల్సి వ‌స్తోంద‌ని వాళ్లంతా ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. తాము కావాలో, స‌ద‌రు రెడ్‌బుక్ ప్ర‌తినిధి కావాలో జ‌న‌సేన‌, టీడీపీ అగ్ర నాయ‌కులు తేల్చుకోవాల‌ని వాళ్లు అంటున్నారు.

6 Replies to “లోకేశ్ ముఖ్య అనుచ‌రుడి నేతృత్వంలో ఆప‌రేషన్ ఆక‌ర్ష్‌!”

  1. లొకెష్ నె రంగం లొకి దిగితె నీ సైట్ కూదా ఎప్పుడొ మూసెసె వారు లెరా? నీది ఒక సన్నసి గొల!

  2. ప్యాలెస్స్ ఎగ్గ్ పఫ్ఫ్ లు 3.6 కొట్లు ఎలా అయ్యయి సార్! అని పాపం సజ్జలని అదిగిన విలెకరులు

    సమాదానం చెప్పకుందా వెల్లి పొయిన సజ్జలా

    .

    ఈ వార్త ఎది రా అయ్యా!

  3. అగ్ని ప్రమాదాలపై చం ద్రబాబు సర్కా రు నిరాధార ఆరోపణలతో రాద్ధాం తం 

    మదనపల్లిలో ఎలాం టి పత్రాలు దగ్థం కాలేదన్న అధికారులు 

    తిరుపతిలో కాలినవి చిత్తు కాగితాలేనని నిర్ధారణ 

    ధవళేశ్వ రం లోనూ చిత్తు కాగితాలనే కాల్చా రన్న టీడీపీ ఎమ్మెల్యే బుచ్చ య్య 

    అయినాసరే సీఎం చం ద్రబాబు పదేపదే దుష్ప్ర చారం 

    వైఎస్సా ర్సీపీ లక్ష్యం గా సర్కా రు కుతం త్రం 

    సూపర్ సిక్స్ హామీల నుం చి ప్రజల దృ ష్టి మళ్లిం చే పన్నా గం

Comments are closed.