Advertisement

Advertisement


Home > Politics - Gossip

పీకే స‌ల‌హా.. ప‌వ‌న్‌పై లోకేశ్ ప్ర‌యోగం!

పీకే స‌ల‌హా.. ప‌వ‌న్‌పై లోకేశ్ ప్ర‌యోగం!

లోకేశ్‌, చంద్ర‌బాబుతో ప్ర‌శాంత్ కిశోర్ మూడు నెల‌లుగా ట‌చ్‌లో ఉన్నారు. టీడీపీ గెలుపు కోసం పీకే స‌ల‌హాలిస్తున్నారు. అయితే ఇప్పుడే ఆయ‌న తెర‌పై క‌నిపించ‌డంతో చ‌ర్చ‌నీయాంశ‌మైంది. పీకే స‌ల‌హాలు ఎలా వుంటాయో జ‌న‌సేన శ్రేణులకు బాగా తెలిసొచ్చింది. పీకే ఎఫెక్ట్ మొద‌ట జ‌న‌సేన‌పై ప‌డింది. అయితే ఈ సంగ‌తి ఆల‌స్యంగా తెలిసొస్తోంది.

పీకే స‌ల‌హాను మొద‌ట‌గా జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్‌పై నారా లోకేశ్ ప్ర‌యోగించార‌నే చ‌ర్చ‌కు తెర‌లేచింది. టీడీపీ-జ‌న‌సేన కూట‌మిలో భాగంగా సీఎం ప‌ద‌వి ఎవ‌రిక‌నే విష‌య‌మై నారా లోకేశ్ వెల్ల‌డించిన అభిప్రాయాలు వివాదాస్ప‌ద‌మైన సంగ‌తి తెలిసిందే. చంద్ర‌బాబే ముఖ్య‌మంత్రి అవుతార‌ని లోకేశ్ కుండ‌బ‌ద్ద‌లు కొట్టిన‌ట్టు చెప్పారు. ఇలా చెప్పాల‌ని స‌ల‌హా ఇచ్చింది ప్ర‌శాంత్ కిశోర్ అని తెలిసింది.

ప‌వ‌న్ ఏమ‌నుకుంటారో, జ‌న‌సేన ఎలా స్పందిస్తుందో అని ఆలోచిస్తే కూచుంటే, టీడీపీ శ్రేణులు వీరోచితంగా పోరాడే ప‌రిస్థితి వుండ‌ద‌ని లోకేశ్‌కు పీకే స్ప‌ష్టం చేశారు. దీంతో 40 శాతం ఓటు బ్యాంక్ క‌లిగిన పార్టీ సీఎం విష‌యంలో మ‌రొక‌రి అభిప్రాయం కోసం ఎదురు చూడ‌డంలో అర్థం లేద‌నే భావ‌న‌తో లోకేశ్ క్లారిటీ ఇచ్చారు. అందుకే పీకే స‌ల‌హాపై లోకేశ్‌కు మ‌రింత గురి పెరిగింది.

పీకేతో ప‌ని చేయించుకోవ‌డంపై దాప‌రికం ఎందుక‌నే ఉద్దేశంతో ఆయ‌న్ను వెంట‌బెట్టుకుని విజ‌య‌వాడ‌కు లోకేశ్ వెళ్లారు. చంద్ర‌బాబు మాత్రం ఈ రాష్ట్రాన్ని స‌క్ర‌మైన మార్గంలో పెట్ట‌గ‌ల స‌మ‌ర్థుడ‌ని చెప్ప‌డం ద్వారా మిత్రుడైన ప‌వ‌న్‌కు అంత సీన్ లేద‌ని లోకేశ్ క్లారిటీ ఇచ్చారు. ఇవ‌న్నీ పీకే ఆలోచ‌న‌లే. ఒక్క దెబ్బ‌కు రెండు పిట్ట‌లు అనే చందంగా... ఇటు ప్ర‌ధాన ప్ర‌త్య‌ర్థి వైసీపీ, అటు మిత్ర‌ప‌క్షం జ‌న‌సేన‌ను కూడా దెబ్బ‌కొట్టిన‌ట్టైంది.

రాజ‌కీయాల్లో ప్ర‌త్య‌ర్థుల‌తో పాటు మిత్ర‌ప‌క్షాల్ని కూడా త‌క్కువ చూడ‌కూడ‌ద‌ని పీకే స‌ల‌హా ఇచ్చార‌ని తెలిసింది. ఏ మాత్రం అజాగ్ర‌త్త‌గా వున్నా, మిత్ర‌పక్షంతో కూడా స‌మ‌స్యే అని, అందుకే సీట్ల విష‌యంలోనూ ఆచితూచి అడుగులు వేయాల‌ని పీకే సూచించిన‌ట్టు స‌మాచారం.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?