ఎల్వీ వర్సెస్‌ బాబు గెలిచేదెవరు.?

ఈనెల 10వ తేదీన క్యాబినెట్‌ మీటింగ్‌ పెట్టి తీరతానంటూ ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆల్రెడీ మీసం మెలేసేశారు. చీఫ్‌ సెక్రెటరీ ఎల్వీ సుబ్రహ్మణ్యం లక్ష్యంగా చంద్రబాబు ఈ 'క్యాబినెట్‌ మీటింగ్‌ హంగామా'కి తెరలేపిన…

ఈనెల 10వ తేదీన క్యాబినెట్‌ మీటింగ్‌ పెట్టి తీరతానంటూ ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆల్రెడీ మీసం మెలేసేశారు. చీఫ్‌ సెక్రెటరీ ఎల్వీ సుబ్రహ్మణ్యం లక్ష్యంగా చంద్రబాబు ఈ 'క్యాబినెట్‌ మీటింగ్‌ హంగామా'కి తెరలేపిన విషయం విదితమే. కేంద్ర ఎన్నికల సంఘం నియమించిన సీఎస్‌ ఎల్వీ సుబ్రహ్మణ్యం మీద చంద్రబాబు చిత్రమైన 'ఆధిపత్య పోరు' నడుపుతున్నారు. ఆ పోరులో చంద్రబాబు నెగ్గే అవకాశాల్లేకపోయినాసరే, పోరు మాత్రం ఆపేది లేదంటున్నారు ఫన్నీగా.

ఇక, క్యాబినెట్‌ సమావేశానికి సంబంధించి 'నోట్‌', సీఎస్‌ ఎల్వీ సుబ్రహ్మణ్యం దగ్గరకి ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంవో) నుంచి వెళ్ళింది. దాంతో, ఈ వ్యవహారంపై ఎల్వీ సుబ్రహ్మణ్యం స్పందించక తప్పలేదు. క్యాబినెట్‌ మీటింగ్‌ జరగాలంటే, దానికి ప్రస్తుత పరిస్థితుల్లో ఏమేం నిబంధనలున్నాయో పేర్కొంటూ, ఆ వివరాల్ని సీఎంఓకి ఎల్వీ సుబ్రహ్మణ్యం పంపుతూ తనదైన స్టయిల్లో 'నోట్‌' అందించారట.

ఎన్నికల కోడ్‌ని పరిగణనలోకి తీసుకుంటే, ముఖ్యమంత్రి క్యాబినెట్‌ మీటింగ్‌ నిర్వహించడానికి కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి తప్పనిసరి. క్యాబినెట్‌ ఎజెండాను తొలుత కేంద్ర ఎన్నికల సంఘానికి పంపాల్సిందే. ఆ తర్వాత అట్నుంచి వచ్చే రెస్పాన్స్‌ని బట్టి, క్యాబినెట్‌ మీటింగ్‌ జరగాలా.? వద్దా.? అన్నది డిసైడ్‌ అవుతుంది. ఇదే విషయాన్ని సీఎస్‌, సీఎంవో కార్యాలయానికి తెలియజేశారట.

మామూలుగా అయితే, చంద్రబాబు ఈ ప్రతిపాదనల్ని అంగీకరించే ప్రసక్తే లేదు. 'నేనే మోనార్క్‌.. నేనే గొప్ప..' అనుకుంటున్నారాయన ప్రస్తుతం. 'నా ఇష్టం, నా క్యాబినెట్‌.. కేంద్రం పెత్తనం ఏంటి.? కేంద్ర ఎన్నికల సంఘం రుబాబు ఏంటి.?' అని ఆల్రెడీ పలు సందర్భాల్లో చంద్రబాబు ప్రశ్నించేశారు కూడా. కానీ, అవన్నీ చంద్రబాబు మీడియా ముందు మాట్లాడటానికే పనికొస్తాయి.

ఆల్రెడీ అధికారులు పలు సందర్భాల్లో ముఖ్యమంత్రికి ఝలక్‌ ఇచ్చేశారు. ఆ అనుభవాలతో అయినా, చంద్రబాబులో మార్పు వచ్చి వుండాలి. కానీ, చంద్రబాబు మారరుగాక మారరు. తాజా పరిణామాల్ని విశ్లేషిస్తే, మరోసారి చంద్రబాబుకి కేంద్ర ఎన్నికల సంఘం నుంచి మొట్టికాయ తప్పకపోవచ్చన్న విషయం అర్థమవుతుంది.

అయితే, ఎన్నికల సంఘం నియమ నిబంధనలకు లోబడి, చప్పగా అయినా క్యాబినెట్‌ సమావేశం నిర్వహించేస్తే, సీఎస్‌ ఎల్వీ సుబ్రహ్మణ్యం మీద పైచేయి సాధించినట్లవుతుందని చంద్రబాబు భావిస్తున్నారన్న 'లీక్‌' టీడీపీ వర్గాల నుంచే అందుతోంది. చూద్దాం.. చంద్రబాబు వర్సెస్‌ ఎల్వీ సుబ్రహ్మణ్యం – ఈ క్యాబినెట్‌ ఫైట్‌ ఏమవుతుందో.!

రజనీకాంత్ పొలిటికల్ ఎంట్రీకి అనుకూలత ఉన్నట్టే..