కోడెల మరణం.. ఈనాడు, ఆంధ్రజ్యోతి రాజీకొచ్చాయ్!

తెలుగుదేశం నేత, అసెంబ్లీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు విషయంలో రెండు ప్రధాన పత్రికలూ రెండు రకాల కథనాలతో రచ్చ రేపాయి. కోడెల ఆత్మహత్య చేసుకున్నారంటూ ఒక మీడియా వర్గం, ఆయన గుండెపోటుతో…

తెలుగుదేశం నేత, అసెంబ్లీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు విషయంలో రెండు ప్రధాన పత్రికలూ రెండు రకాల కథనాలతో రచ్చ రేపాయి. కోడెల ఆత్మహత్య చేసుకున్నారంటూ ఒక మీడియా వర్గం, ఆయన గుండెపోటుతో మరణించారంటూ మరో వర్గం ప్రచారం చేశాయి.

విశేషం ఏమిటంటే.. నేతల స్టేట్ మెంట్ ను కూడా ఈ మీడియా వర్గాలు తమ వాదనకు అనుగుణంగా రాసుకోవడం గమనార్హం. పై ఫొటోలో మొదటిది ఈనాడు కథనం, రెండోది ఆంధ్రజ్యోతిది.

తెలుగుదేశం పార్టీకి ఈ మీడియా వర్గాలతో ఉన్న బంధం ఏమిటో చెప్పనక్కర్లేదు. కోడెలది ఆత్మహత్య అని టీడీపీ కూడా అంటోంది. ఆ వాదనను మొదటి నుంచి వినిపించింది ఆంధ్రజ్యోతి. కోడెల ఉరి వేసుకున్నారంటూ.. మొదట రచ్చ రేపింది.. ఆ పత్రిక. చివరకు ఈనాడు కూడా ఆంధ్రజ్యోతి దారిలోకే వెళ్లింది. కోడెలది ఆత్మహత్య అని తేల్చింది.

కోడెలది ఆత్మహత్య అంటూ తెలుగుదేశం పార్టీ డిక్లేర్డ్ చేసింది మరి. ఈ వ్యవహారంపై ఎంత రాజకీయం చేయాలో చంద్రబాబు నాయుడు అంతా ప్రకటించేశారు.

రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా సంతాపదినాలట. తెలుగుదేశం వాళ్లు నిర్వహిస్తారట.