ఎన్టీఆర్ Vs పవన్.. ‘తారక’ మంత్రం పనిచేస్తుందా?

టీడీపీలోకి ఎన్టీఆర్ రావాలంటున్నారు కార్యకర్తలు. చంద్రబాబు ఎక్కడ పర్యటించినా ఇవే నినాదాలు, అవే జెండాలు కనిపిస్తున్నాయి. నిజంగా ఎన్టీఆర్ వచ్చాడే అనుకుందాం. అలా జరిగితే టీడీపీ భవితవ్వం మారిపోతుందా? చరిత్ర ఏం చెబుతోంది? సరిగ్గా…

టీడీపీలోకి ఎన్టీఆర్ రావాలంటున్నారు కార్యకర్తలు. చంద్రబాబు ఎక్కడ పర్యటించినా ఇవే నినాదాలు, అవే జెండాలు కనిపిస్తున్నాయి. నిజంగా ఎన్టీఆర్ వచ్చాడే అనుకుందాం. అలా జరిగితే టీడీపీ భవితవ్వం మారిపోతుందా? చరిత్ర ఏం చెబుతోంది? సరిగ్గా అక్కడే పవన్ తో పోలిక తీస్తున్నారు చాలామంది.

టీడీపీలో పవన్ సెంటిమెంట్

చంద్రబాబు కోసమే పవన్ కల్యాణ్ 2014లో పార్టీ పెట్టినట్టు అనిపించింది. అంతలా బాబుకు సపోర్ట్ చేశారు. ఇద్దరి ఆంతరంగిక సమావేశాలు, ఒప్పందాలు ఓ రేంజ్ లో జరిగాయి. 

ఈ కాంబినేషన్ కు అప్పట్లో దేశవ్యాప్తంగా ఉన్న మోడీ వేవ్ కూడా కలిసొచ్చి.. బాబు ముఖ్యమంత్రి అయిపోయారు. అలా ఈసారి ఎన్టీఆర్ వస్తే టీడీపీ గట్టెక్కుతుందనేది చాలామంది నమ్మకం.

అప్పుడు మోడీ వేవ్.. ఇప్పుడు జగన్ వేవ్..

అప్పట్లో పవన్ కల్యాణ్ ఫ్యాక్టర్ టీడీపీకి కలిసొచ్చిన అంశం. కాబట్టి ఇప్పుడు ఎన్టీఆర్ ఫ్యాక్టర్ టీడీపీకి కలిసొస్తుందని అనుకుంటున్నారంతా. కానీ అప్పట్లో మోడీ వేవ్ టీడీపీకి అనుకూలంగా ఉంది. ఇప్పుడు మోడీని టీడీపీ వదిలేసింది. 

కలసి రావాలన్నా ఏపీలో బీజేపీ, బాబుని నమ్మే పరిస్థితి లేదు. దీనికితోడు ఏపీలో ప్రస్తుతం జగన్ వేవ్ కొనసాగుతోంది. ఈ వేవ్ తో టీడీపీకి వ్యతిరేక ఫలితాలు వస్తాయి. కాబట్టి ఈ దశలో ఎన్టీఆర్ కి, టీడీపీకి ఇద్దరికీ కష్టమే. అందుకే సెంటిమెంట్ ని పక్కనపెట్టి వాస్తవికంగా ఆలోచించాలని అంటున్నారు మరికొందరు.

పవన్ నుంచి ఎన్టీఆర్ నేర్చుకోవాల్సిన పాఠం అదే..

స్టార్ డమ్ అనేది రాజకీయాలకు పనికిరాదు. 2019లో పవన్ రెండు చోట్ల ఓడిపోవడమే దీనికి నిదర్శనం. అప్పట్లో మెగాస్టార్ చిరంజీవిపై ఓ మహిళ గెలవడం అంతకంటే పెద్ద నిదర్శనం. అంతెందుకు విశ్వనటుడు అనిపించుకున్న కమల్ హాసన్ కూడా తమిళనాట ఓ మహిళ చేతిలో ఓడిపోవడం తాజా నిదర్శనం. 

సో.. పవన్ కల్యాణ్ రాజకీయ వైఫల్యాల నుంచి ఎన్టీఆర్ పాఠం నేర్చుకోవాలి. సరైన నిర్ణయం తీసుకోవాలి. పైగా ఎంత కష్టపడినా లోకేష్ ను మించి ఎన్టీఆర్ ను బాబు ఎదగనీయడనే కఠోర సత్యాన్ని కూడా తారక్ గుర్తించాలి.

ఇంతకీ బాబు మనసులో ఏముంది?

పోనీ అభిమానుల కోరిక ఫలించి ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలని ఆశపడ్డారే అనుకుందాం. మరి పిలిచేది ఎవరు..? అప్పట్లో అవసరం తీరాక పొమ్మనలేక పొగబెట్టారు బాబు. ఇప్పుడు మళ్లీ వెళ్లి ఎన్టీఆర్ ను ఆహ్వానించలేరు. అలా అని వదిలి ఉండలేని పరిస్థితి. 

రాబోయే రోజుల్లో ఎన్టీఆర్ అవసరం బాబుకు చాలా ఎక్కువ. అందుకే మంచి ఫ్యామిలీ అకేషన్ కోసం చంద్రబాబు ఎదురుచూస్తున్నారు. ఆ అకేషన్ ను అడ్డం పెట్టుకొని ఎన్టీఆర్ ను దువ్వాలనేది ఆయన ప్లాన్.

హరికృష్ణ మరణాన్ని కూడా తన రాజకీయం కోసం వాడుకున్న బాబు.. ఎన్టీఆర్ ను అంత ఈజీగా వదిలిపెట్టరు. ఎలాగోలా కెలకడానికే ప్రయత్నిస్తారు. మరి ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చి బలి అవుతారా..? లేక తన ఛరిష్మాతో బాబుకు పూర్వవైభవం తెచ్చిపెడతారా? నిజంగానే ఎన్టీఆర్ ఫ్యాక్టర్ టీడీపీకి కలిసొస్తుందా..? కాలమే నిర్ణయించాలి.