Advertisement

Advertisement


Home > Politics - Gossip

పవన్, బాబు.. ఒక్కరైనా ఆ సంగతి చెప్పరే!

పవన్, బాబు.. ఒక్కరైనా ఆ సంగతి చెప్పరే!

చంద్రబాబునాయుడు నివాసం ఉంటున్న ఇల్లు కృష్ణానదిని ఆక్రమించుకుని కట్టుకున్నదే. నదికి నిండుగా ప్రవాహం రాగానే అది మునిగిపోయే పరిస్థితి వచ్చింది. అన్నిచోట్లా చేసినట్లుగానే ఇక్కడ కూడా డ్రోన్ల ద్వారా వాస్తవ పరిస్థితిని తెలుసుకోవడానికి ప్రభుత్వం ప్రయత్నించింది. చంద్రబాబునాయుడు తెగ కంగారుపడిపోయి.. నానా యాగీచేశారు. పవన్ కల్యాణ్ కూడా ఒక రకంగా ఆయనకు వంతపాడారు. అయితే వీరిద్దరూ కూడా ప్రభుత్వం చేస్తున్న తప్పు ఏమిటనేది స్పష్టంగా చెప్పలేకపోతున్నారు.

‘‘లోతట్టు ప్రాంతాల్లో ప్రజలను కాపాడే పరిస్థితి చూడండి.. నా ఇంటిమీద డ్రోన్లను తిప్పుతూ నా భద్రతను ప్రశార్థకం చేయడంకాదు... నా మీద కుట్రలు చేయడంకాదు. నా ఇంటిని ముంచేయడం కోసం లోతట్టు ప్రాంతాలను ముంచేస్తున్నారా? నా ఇంటిని ముంచేయడం కోసం బ్యారేజీ గేట్లకు పడవలు అడ్డం పెడతారా?’’ అని చంద్రబాబు అంటున్నారు. పవన్ కల్యాణ్ కూడా ఇంచుమించుగా ఇదే మాటలు మాట్లాడుతున్నారు. ‘‘డ్రోన్ల రాజకీయాలు కట్టిపెట్టండి. లోతట్టు ప్రాంతాల్లో ప్రజల సమస్యలు చూడండి. అక్కడ ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తీర్చండి. మునిగిపోకుండాచూడండి..’’ ఇలాంటి కబుర్లే ఆయన కూడా చెబుతున్నారు.

నామ్ కే వాస్తేగా చెలామణీలో ఉన్న భాజపా, కాంగ్రెస్ నాయకులు కూడా ఇలాంటి మాటలు వల్లిస్తున్నారు. ఈ అందరు విపక్ష నాయకుల మాటల్లోనూ ‘‘లోతట్టు ప్రాంతాల’’ ప్రజలను కాపాడండి... అనేమాట జనాంతికంగా వినిపిస్తోంది. అయితే లోతట్టు ప్రాంతాలు అనగా ఏవి? ఎక్కడ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు? ఎక్కడి ప్రజలను ప్రభుత్వం కాపాడాలి? కనీసం ఏ ఒక్కరైనా స్పష్టంగా ఫలానా చోట ఊర్లు మునిగిపోయి ప్రజలు ఇబ్బంది పడుతోంటే.. ప్రభుత్వం పట్టించుకోలేదు.. చంద్రబాబు ఇంటిచుట్టూ తిరుగుతోంది అని నిందించగల స్థితిలో ఉన్నారా? అనేది ప్రశ్న!

ఎక్కడ ప్రజలు ఇబ్బంది పడుతున్నారో వారికి కూడా తెలియదు... దాని అర్థం.. ప్రభుత్వం చాలా పక్కాగా పకడ్బందీగా చర్యలు తీసుకుంటోందని..! ఏం చెప్పాలో తెలియక నిందలు వేసినా, విమర్శలు చేసినా.. సూటిగా చెప్పడం తెలియక.. చెప్పడానికి ఏమీలేక.. ఏదో నాటకీయంగా ‘లోతట్టు ప్రాంతాలు’  అనే పదం వాడుకుంటూ నడిపిస్తున్నారు. చిత్తశుద్ధి ఉంటే.. కార్యక్షేత్రంలోకి వారు కూడా రావాలి.

చంద్రబాబు ఇంటిమీద డ్రోన్ ఎగరగానే.. తెలుగుదేశం నాయకులంతా పోలోమని అక్కడకు పరుగెత్తుకెళ్లి.. పోలీసుల్తో తగాదా పెట్టుకోడం కాదు.. నిజంగా చిత్తశుద్ధి ఉంటే.. ప్రజలు ఇబ్బంది పడేలా మునిగిపోతున్న ప్రాంతాలేవో గుర్తించి.. అక్కడకు వెళ్లి.. ప్రభుత్వం అక్కడేమీ చేయడంలేదంటూ నిరసించాలి. అప్పుడే ప్రభుత్వానికి మేలు జరుగుతుంది. అంతే తప్ప ఇలాంటి డ్రామాల వల్ల ఉపయోగం ఉండదు.

‘బాహుబలి’ రికార్డ్స్ ను ‘సాహో’ అధిగమిస్తుందా?

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?