Advertisement

Advertisement


Home > Politics - Gossip

నోరు కట్టేసుకుని ఉంటున్న పవన్ కళ్యాణ్

నోరు కట్టేసుకుని ఉంటున్న పవన్ కళ్యాణ్

ఇదే మరొక సందర్భంలో అయితే గనుక పవన్ కళ్యాణ్ ఈ పాటికి రెచ్చిపోయి ఉండేవారు.  ఢిల్లీలో జరుగుతున్న అల్లర్లపై ఆవేశపూరితమైన ప్రసంగాలు చేసి ఉండేవారు.  తనలోని విశ్వమానవుడు….  మతాల ప్రాతిపదికన కొట్టుకుంటున్న ఢిల్లీ పౌరుల ఘర్షణల గురించి విపరీతంగా ఆవేదన చెంది ఉండేవాడు. కానీ ఇప్పుడు పరిస్థితి అంతా తారుమారు అయిపోయింది. పవన్ కళ్యాణ్ చేతులు  కట్టేయబడి ఉన్నాయి. ఆయన నోరు కుట్టేయబడి ఉంది. అందుకే పవన్ కళ్యాణ్ తన సహజమైన శైలికి భిన్నంగా మౌనం పాటిస్తూ ఉన్నారు.

ఢిల్లీలో సిఏఏ ఎన్ఆర్సి లకు వ్యతిరేకంగా ఆందోళనలు జరుగుతున్న సంగతి తెలిసిందే.ఈ ఆందోళనలు కాస్త హింసాత్మక రూపం సంతరించుకుని…. రెండు మతాల వారి ఘర్షణలతో నగరం అట్టుడుకుతోంది. ఇప్పటికే 27 మంది దుర్మరణం పాలయ్యారు.  పరిస్థితి ఇంకా శాంతించలేదు.  దేశ రాజధాని లో జరుగుతున్న ఈ అల్లర్ల గురించి దేశమూ ఆందోళన చెందుతోంది.  కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను అందరూ ఎండగడుతూ ఉన్నారు.  సాధారణంగా ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు అందరికంటే ఎక్కువగా ఉండే పవన్ కళ్యాణ్ మాత్రం మౌనం పాటిస్తున్నారు. సినిమా షూటింగ్ లలోబిజీ బిజీగా గడుపుతున్నారు. ప్రస్తుతం ఆయన తన పార్టీ జనసేన ను,  భాజపా సంకలో కూర్చోబెట్టి ఉండడమే అందుకు కారణం.

కేంద్ర ప్రభుత్వం విషయానికి వస్తే ఇదివరకు కూడా పవన్ కళ్యాణ్ తన సహజమైన దూకుడు,  ఆవేశాలను ప్రదర్శించేవారు అని చెప్పలేం.  గతంలో కూడా కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలు ఆయనకు కేవలం కొందరి తప్పుగా మాత్రమే కనిపించాయి.  కేంద్రాన్ని తిట్టవలసి వస్తే…  మోడీ పేరును మాత్రం పక్కనపెట్టి అరుణ్ జైట్లీ, అమిత్ షా పేర్లను మాత్రం ప్రస్తావిస్తూ నిప్పులు చెరగడం గతంలో పవన్ అలవాటు! ఇప్పుడు చూడబోతే అంత సీన్ కూడా లేదు.  అమిత్ షా పేరు చెప్పి తప్పులు ఎన్నగల ధైర్యం ఇప్పుడు పవన్ లో లేదు.

రాష్ట్రంలో లో ఎన్నికల తర్వాత తనకు ఉన్నపళంగా అధికారం కట్టబెట్టాలని పార్టీ మీద పవన్ కళ్యాణ్ కు విముఖత వచ్చేసింది. రాజకీయ అస్తిత్వాన్ని వదులుకోవడం ఇష్టం లేక..  అతి బలవంతంగా పార్టీని నిర్వహిస్తున్నారు.  నేను సినిమాలలో సంపాదించి పార్టీ కోసం ఖర్చు పెడుతున్నా… అంటూ ప్రజల ఎదుట పదేపదే బేల పలుకులు పలుకుతున్నారు.  పార్టీ నిర్వహణ చేతకాక,  కేంద్రంలోని భారతీయ జనతా పార్టీతో జత కలిశారు.  ఇన్నాళ్ళు రాష్ట్రం కోసం పరితపించి పోతున్నా అంటూ లేవనెత్తిన ప్రత్యేక హోదా డిమాండ్ ను కూడా పక్కన పెట్టేశారు. తీరా ఇప్పుడు ఢిల్లీ పరిణామాల నేపథ్యంలో ప్రజల కోసం మాట్లాడడం కూడా పవన్ కళ్యాణ్ మరిచిపోయారు.

నాలుగేళ్ల తర్వాత హిట్‌ వచ్చింది

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?