కృష్ణాతీరం ఆక్రమణలు, అమరావతి ప్రాంతంలో విస్తృతమైన రియల్ ఎస్టేట్ వ్యాపారం, రాజకీయ కింగ్ మేకర్ తదితర ఆరోపణలు ఉన్న లింగమనేని రమేష్.. పవన్ కల్యాణ్ తాజా ఉద్యమాలకు స్క్రిప్టు రచనలో ఉన్నారా? అనే అనుమానాలు ప్రజల్లో కలుగుతున్నాయి. కృష్ణానది ముంపు పరిధిలో ఉన్నదనే భయంతో ఉన్న అమరావతి ప్రాంతంలో రాజధాని గురించి.. ప్రస్తుతం బీభత్సంగా చర్చోపచర్చలు జరుగుతున్న సనమయంలో… జనసేనాని పవన్ కల్యాణ్ మాటలు పలువురికి ఇలాంటి అభిప్రాయాన్ని కలిగిస్తున్నాయి.
ఒకప్పుడు ఇదే పవన్ కల్యాణ్.. రాజధానికి భూములు ఇవ్వడానికి వ్యతిరేకంగా కన్నీళ్లు పెట్టుకున్న ప్రజలకు అండగా నిలబడతానని మాట ఇచ్చారు. ఆ తర్వాత ఆ ప్రాంతానికి వెళ్లి వారితో కలిసి మాట్లాడి వచ్చిన తర్వాత.. ఆయన పోరాటం మొత్తం చప్పున చల్లారిపోయింది. చంద్రబాబుతో భేటీ అయి.. ప్రైవేటుగా మంతనాలు సాగించారు. ప్రజల కష్టాలన్నీ సీఎంకు చెప్పేశాను.. అన్నీ తీరిపోతాయి… అని జనాంతికంగా ప్రకటించి ఊరుకున్నారు. అంతే తప్ప రాజధాని రైతులకు ఆయన ఒరగబెట్టిందేమీ లేదు.
ఇప్పుడు ఏదో గుప్పెడు మంది అమరావతి ప్రాంతంనుంచి వచ్చి తనను ఆఫీసులో కలవగానే.. పవన్ కల్యాణ్.. మళ్లీ ఆవేశపూరిత ప్రకటనలు చేస్తున్నారు. అమరావతిని అక్కడినుంచి తరలించడానికి వీల్లేదని.. స్వయంగా అక్కడ నిర్మాణ పనులు ఎంతవరకు వచ్చాయో పరిశీలించడానికి తాను వెళ్తానని పవన్ అంటున్నారు. అయితే.. హఠాత్తుగా పవన్ రాజధానిని అమరావతినుంచి మార్చరాదంటూ ఉద్యమబాటను అందుకోవడం వెనుక లింగమనేని రమేష్ ప్రేరేపణ ఉన్నదని పలువురు అనుమానిస్తున్నారు.
లింగమనేని రమేష్ కు చెందిన, కృష్ణానదిని ఆక్రమించుకుని కట్టిన ఇంటిలోనే ప్రస్తుతం ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు ఉంటున్నారు. లింగమనేని రమేష్ నుంచి కారుచౌకగా కొనుక్కున్న స్థలంలోనే పవన్ కల్యాణ్ కూడా తన ఇల్లు, ఆఫీసు కట్టుకున్నారు. అందుకు ఫేవర్ గా.. లింగమనేనికి నష్టాలు వాటిల్లకుండా.. రాజధానిని అక్కడే ఉంచేందుకు పవన్ పోరాటానికి దిగబోతున్నట్లుగా కనిపిస్తోంది. మరి ఆ పోరాటంలో ఆయన ఏమేరకు సక్సెస్ అవుతారో.. లింగమనేనికి ఎంత లబ్ధి చేకూర్చగలరో చూడాలి.