
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలోకి పవన్ కల్యాణ్ ను భాగస్వామ్యం చేయాలని భారతీయ జనతా పార్టీ ప్రయత్నాలు చేస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఇందుకోసం పవన్ కల్యాణ్ తో సంప్రదింపులు సాగుతున్నట్టుగా ఉన్నాయి. మరి పవన్ కల్యాణ్ మద్దతు కావాలంటే బీజేపీ నేతలే వెళ్లి ఆయనను కలవాల్సింది. కానీ, పవన్ కల్యాణ్ నే బీజేపీ నేతలు ఢిల్లీకి పిలిపించుకుని మద్దతు అడుగుతున్నట్టుగా ఉన్నారు.
అయితే ఈ వ్యవహారంలో పవన్ కల్యాణ్ వైపు నుంచి కొన్ని కండీషన్లు ఉన్నట్టుగా ప్రచారం జరుగుతూ ఉంది. ఏపీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని కలుపుకుపోవాలనే తన కోరికను పవన్ కల్యాణ్ ఈ సందర్భంగా బయట పెట్టినట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. ఎలాగూ పవన్ కల్యాణ్ ఇలాగే చేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఎలాగైనా చంద్రబాబును సీఎంగా చూసుకోవడానికి పవన్ కల్యాణ్ పరితపిస్తూ ఉన్నారు.
ఇప్పటికే తెలుగుదేశాన్ని కలుపుకుపోవడం గురించి పవన్ కల్యాణ్ పలు దఫాలుగా బీజేపీ అధినాయకుల వద్ద ప్రయత్నాలు చేశారు. అయితే చంద్రబాబును సీఎంగా చూసుకోవాలని పవన్ కల్యాణ్ కు ఉందేమో కానీ, బీజేపీకి అయితే అంత ఆసక్తి ఏమీ లేదు!
మరి అదును చూసి అన్నట్టుగా.. బీజేపీ వాళ్లు తనను కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారం అని పిలిస్తే.. చంద్రబాబు ప్రస్తావనను పవన్ కల్యాణ్ తీసుకు వచ్చారని, ఏపీలో తెలుగుదేశం పార్టీని కలుపుకోవాలనే ప్రతిపాదనను ఈ సందర్బంగా తెచ్చాడంటే చంద్రబాబుపై పవన్ కల్యాణ్ కు ఉన్న మమకారం ఏరేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. తన సాయాన్ని బీజేపీ అడిగితే... కండీషన్ గా చంద్రబాబు ప్రస్తావన తీసుకువచ్చాడంటే పవన్-చంద్రబాబుల బంధం అలాంటిలాంటిది కాదు!
అయితే పవన్ కల్యాణ్ కండీషన్ పై బీజేపీ మల్లగుల్లాలు పడేది ఉండకపోవచ్చు. ఆ సంగతి మళ్లీ చూద్దాం.. అంటూ ప్రస్తుతానికి వెళ్లి ప్రచారం చేయమని చెప్పడం బీజేపీ ఏపీ వ్యవహారాల ఇన్ చార్జికి మరీ కష్టం ఏమీ కాకపోవచ్చు కూడా!
నేను మొక్కలతో, దేముడితో మాట్లాడుతా