క‌డ‌ప జెడ్పీ చైర్మ‌న్ రేస్‌లో పుత్తా!

క‌డ‌ప జెడ్పీ చైర్మ‌న్ రేస్‌లో క‌మ‌లాపురం టీడీపీ నాయ‌కుడు పుత్తా న‌ర‌సింహారెడ్డి ఉన్నారు. ఇదే విష‌యాన్ని ఉమ్మ‌డి క‌డ‌ప జిల్లా జిల్లా ప‌రిష‌త్ స‌భ్యుల స‌మావేశంలో వైఎస్సార్‌సీపీ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి…

క‌డ‌ప జెడ్పీ చైర్మ‌న్ రేస్‌లో క‌మ‌లాపురం టీడీపీ నాయ‌కుడు పుత్తా న‌ర‌సింహారెడ్డి ఉన్నారు. ఇదే విష‌యాన్ని ఉమ్మ‌డి క‌డ‌ప జిల్లా జిల్లా ప‌రిష‌త్ స‌భ్యుల స‌మావేశంలో వైఎస్సార్‌సీపీ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి అన్న‌ట్టు తెలిసింది. ఎట్టి ప‌రిస్థితుల్లోనూ సొంత జిల్లాలో జెడ్పీ చైర్మ‌న్ ప‌ద‌విని చేజార్చుకోవ‌ద్ద‌ని వైఎస్ జ‌గ‌న్ ప‌ట్టుద‌ల‌తో ఉన్నారు. ఇటీవ‌ల ఉమ్మ‌డి విశాఖ జిల్లా స్థానిక సంస్థ‌ల ఎమ్మెల్సీ ప‌ద‌విని ఏక‌గ్రీవంగా గెలుచుకున్న వైసీపీ, అదే హ‌వాను కొన‌సాగించాల‌ని ప‌ట్టుద‌ల‌తో ఉంది.

ముఖ్యంగా జ‌గ‌న్ సొంత జిల్లా క‌డ‌ప‌లో వైసీపీని రాజ‌కీయంగా దెబ్బ తీయాల‌ని టీడీపీ ఆలోచిస్తోంది. ఇందులో భాగంగా వైసీపీ చేతిలో ఉన్న క‌డ‌ప జెడ్పీని సొంతం చేసుకోవాల‌ని టీడీపీ ఎత్తుగ‌డ వేస్తోంది. ఈ విష‌యాన్ని ప‌సిగ‌ట్టిన వైసీపీ అధిష్టానం అప్ర‌మ‌త్త‌మైంది. దీంతో వైసీపీ జెడ్పీటీసీ స‌భ్యుల్ని ఈ నెల 21న తాడేప‌ల్లికి తీసుకెళ్లి జ‌గ‌న్‌తో స‌మావేశ‌ప‌రిచారు. ఈ సంద‌ర్భంగా జ‌గ‌న్ మాట్లాడుతూ టీడీపీ నుంచి పుత్తా న‌ర‌సింహారెడ్డి జెడ్పీ చైర్మ‌న్ స్థానాన్ని ఆశిస్తున్నారని తెలిసింద‌న్నారు.

టీడీపీ ప్ర‌లోభాల‌కు గురి కావ‌ద్ద‌ని ఆయ‌న సూచించారు. రాజ‌కీయంలో వెలుగు, చీక‌టి శాశ్వ‌తం కాద‌ని జ‌గ‌న్ చెప్పుకొచ్చారు. 2014లో వైసీపీ ఓడిపోయిన‌ప్పుడు కూడా ఇక పార్టీ ప‌ని అయిపోయింద‌ని మాట్లాడార‌ని గుర్తు చేశారు. ఆ త‌ర్వాత 2019లో అధికారంలోకి వ‌చ్చామ‌న్నారు. ఇప్పుడు కూడా అలాంటి ప‌రిస్థితే వుంద‌న్నారు. మ‌ళ్లీ 2029లో అధికారంలోకి వ‌స్తామ‌ని, కాస్త ఓపిక వ‌హించాల‌ని జెడ్పీ స‌భ్యుల్ని ఆయ‌న కోరిన‌ట్టు తెలిసింది.

ఇదిలా వుండ‌గా ఉమ్మ‌డి క‌డ‌ప జిల్లాలో మొత్తం 50 జెడ్పీ స్థానాలున్నాయి. వీటిలో రెండు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీ ఏకైక స్థానంలో గెలిచింది. టీడీపీలో ఐదుగురు, బీజేపీలో ఒక వైసీపీ స‌భ్యుడు చేరారు. ఏ ర‌కంగా చూసినా వైసీపీ వైపు 40 మంది ఉన్నారు. అయితే కూట‌మి అధికారంలో వుండ‌డంతో లాక్కుంటార‌నే అనుమానం వైసీపీలో వుంది. అయితే త‌మ స‌భ్యుల అవస‌రాల్ని గుర్తించి, ఆర్థికంగా అండ‌గా నిలిచేందుకు వైసీపీ అధిష్టానం ముందుకొచ్చిన‌ట్టు తెలిసింది. దీంతో ఇప్ప‌ట్లో క‌డ‌ప జెడ్పీ స్థానం టీడీపీ వ‌శ‌మ‌య్యే అవ‌కాశం లేద‌ని వైసీపీ ధీమాగా వుంది.

4 Replies to “క‌డ‌ప జెడ్పీ చైర్మ‌న్ రేస్‌లో పుత్తా!”

Comments are closed.