స్వామీజీలు, సన్యాసులు అంటే ఒకప్పటి లెక్కవేరు. సర్వం త్యజించేవారు. కానీ ఇప్పటి లెక్క వేరు. ఇప్పుడు అంతా హైటెక్ స్వామీజీలు. వారికి అక్కరలేనిది లేదు.
రాజకీయాలు, ప్రచారాలు, భూమలు, ఇలా ఒకటేమిటి అన్నీ కావాలి. ఇప్పటికే కొందరు స్వాములకు ఛానెళ్లు కూడా వున్నాయి. ప్రత్యక్షంగానొ, పరోక్షంగానో మీడియా సంస్థలతో బంధాలు వున్నాయి.
లేటెస్ట్ గా ఓ ఛానెల్ ను ఓ స్వామీజీ కనుసన్నలలోకి తెచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలుస్తోంది. ఇప్పటికే వున్న ఓ డివోషనల్ చానెల్ తాలూకా ఎడిటోరియర్ నిర్వహణ బాధ్యతలను ఓ స్వామీజీ టీమ్ కు అప్పగించేలా ప్రయత్నాలు జరుగుతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.
తెలుగురాష్ట్రాల్లోని ఓ రాష్ట్ర ప్రభుత్వంలో గట్టి ఇన్ ఫ్లూయెన్స్ కలిగిన ఆ స్వామీజీ ఇప్పుడు ధర్మ ప్రచారం, హిందూత్వ ప్రచారం వంటి వ్యవహారాలను గట్టిగా నిర్వహించాలని అనుకుంటున్నారట. అందుకు ఓ ఛానెల్ కావాలి.కానీ ఇప్పటికిప్పుడు ఛానెల్ పెట్టడం, లేదా కొనుగోలు చేయడం వంటివి అయ్యే పని కాదు.
అందుకే ఇప్పటికే వున్న ఓ డివోషనల్ చానెల్ తో సంప్రదింపులు జరుగుతున్నాయని, ఎడిటోరియల్ మేనేజ్ మెంట్ ఆ స్వామీజీ కనుసన్నలలో నడిచేలా ఏర్పాటుచేసేందుకు ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది.