Advertisement

Advertisement


Home > Politics - Gossip

‘స్విస్ ఛాలెంజ్’ బాబు బాగోతం మళ్లీ తెరపైకి

‘స్విస్ ఛాలెంజ్’ బాబు బాగోతం మళ్లీ తెరపైకి

చంద్రబాబునాయుడు హయాంలో ఎన్నెన్ని రకాల వక్రమార్గాలకు తెరతీసారో.. మరోసారి చర్చనీయాంశం అవుతున్నాయి. బ్రహ్మపదార్థం లాగా ప్రజలకు అర్థంకాని పరిభాషలో, అర్థంకాని విధానాలతో అక్రమాలకు తెరలేపడానికి జరిగిన ప్రయత్నాలను వైఎస్సార్ కాంగ్రెస్ తొలినుంచి వ్యతిరేకిస్తూనే ఉంది. కాకపోతే.. వాటిమీద వివిధ వర్గాలనుంచి దాఖలైన పిటిషన్లు తాజాగా హైకోర్టులో విచారణకు వచ్చాయి. వాటిపై ప్రభుత్వం తమ అభిప్రాయం తెలియజేయాలని హైకోర్టు కోరింది.

అమరావతి ముసుగులో వేలవేల కోట్ల రూపాయల భారీ అవినీతికి తెరతీయడానికి చంద్రబాబునాయుడు ప్రపంచంలో ఎన్నిరకాల మాయోపాయాలు ఉన్నాయో.. వాటన్నింటినీ కూడా పరిశీలించారనే ఆరోపణలు ఉన్నాయి. వాటిలో అత్యుత్తమమైనదిగా.. ఇక్కడ ఆయన ప్రయోగించడానికి పూనుకున్న కుయుక్తి.. ‘స్విస్ చాలెంజ్’ అని పలువురు విమర్శిస్తుంటారు. అయితే ఈ స్విస్ చాలెంజ్ పద్ధతిలో కాంట్రాక్టులు అప్పగించే ప్రక్రియను తప్పుపడుతూ.. అప్పట్లోనే పలు కోర్టు కేసులు, పిల్‌లు దాఖలయ్యాయి. అవి ఇంకా విచారణలో ఉన్నాయి.

అలాంటి పిటిషన్లను విచారిస్తున్న సందర్భంగా.. తాజాగా రాష్ట్ర హైకోర్టు.. అసలు ఈ స్విస్ చాలెంజ్ విధానంపై మీ అభిప్రాయం ఏమిటో చెప్పాలంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీంతో.. అప్పట్లో ఈ ముసుగులో చంద్రబాబు నాయుడు ఎలాంటి దోపిడీకి వ్యూహరచన చేశారనే విషయాన్ని కోర్టు ద్వారా మరోసారి ప్రజల ముందుకు చర్చకు వస్తోంది. స్విస్ చాలెంజ్ అనేది.. అయిన వారికి మాత్రమే కాంట్రాక్టులను కట్టబెట్టే ఒక పెద్ద కుయుక్తి. ఇందులో కోట్లకు కోట్ల రూపాయల దోపిడీ అధికారికంగానే జరుగుతుంది.

ప్రభుత్వం ఒక కాంట్రాక్టు సంస్థను ఎంపిక చేసి.. వారితో ఒక వర్క్‌కు సంబంధించిన ప్రతిపాదన తయారుచేయిస్తుంది. ఆ ప్రతిపాదనను పరిశీలించే అదే అర్హతలు ఉండే ఇతర సంస్థలు తాము అంతకంటె తక్కువకు చేస్తామని ప్రపోజ్ చేయవచ్చు. అలాచేసిన తర్వాత... మారిన డిజైన్లతో తాము అంతకంటె తక్కువకు చేస్తాం అని తొలి సంస్థ కూడా మళ్లీ పోటీకి రావొచ్చు. ఇలా వరుసగా జరుగుతుంది. చివరికి తాము అనుకున్న సంస్థకే అనుకున్న ధరకే కాంట్రాక్టును కట్టబెట్టడం ప్రభుత్వానికి సాధ్యమవుతుంది.

సామాన్యులకు అర్థంకాని మెలికలతో కూడిన దోపిడీ ఇందులో ఉంటుంది. అయితే అలాంటి స్విస్ చాలెంజ్ విధాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆరోజుల్లోనే తీవ్రంగా నిరసించింది. అందులో లోపాలను ప్రపంచానికి చాటి చెప్పింది. అలాంటిది ఇప్పుడు ప్రభుత్వపరంగా ఆ పద్ధతిపై కోర్టుకు అభిప్రాయం చెప్పే వెసులుబాటు వచ్చింది. దీంతో.. స్విస్ చాలెంజ్ లో ఉన్న దోపిడీ ఏమిటో జగన్ సర్కారు మళ్లీ నివేదించనుంది. బాబు కుట్రలు మరోసారి ప్రపంచం దృష్టికి వస్తాయి.

జగన్ ఎప్పూడూ జాగ్రత్తగా ఉండాలి సుమా!

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?