cloudfront

Advertisement

Advertisement


Home > Politics - Gossip

గుబులు: ఏ క్షణంలో ఎవరి గుట్టు రట్టవుతుందో?

గుబులు: ఏ క్షణంలో ఎవరి గుట్టు రట్టవుతుందో?

తెలుగుదేశం పార్టీకి చెందిన మాజీ మంత్రులందరిలోనూ గుబులు మొదలైంది. ఏ క్షణంలో ఎవరి గుట్టురట్టవుతుందోనని మధన పడిపోతున్నారు. చంద్రబాబు జమానాలో మంత్రులుగా దోచుకున్నదంతా కొత్త ప్రభుత్వం బయటకు కక్కిస్తుందేమోనని ఆందోళన చెందుతున్నారు. ఇప్పుడు ఈఎస్ఐ బాగోతాల గురించి బయటపడింది. అచ్చెన్నాయుడు పాత్ర సందేహాస్పదంగా మారింది. మాజీ మంత్రి అయినా ఉపేక్షించమని, స్వాహాచేసింది కక్కిస్తామని ప్రభుత్వం అంటోంది. ఈ నేపథ్యంలో మిగిలిన మాజీ మంత్రులందరూ కూడా భుజాలు తడుముకుంటున్నారు.

తాజాగా ఈఎస్ఐ కు సంబంధించి గతంలో కొనుగోళ్లలో 70 కోట్ల రూపాయల అవినీతి జరిగినట్లుగా వెలుగులోకి వచ్చింది. అప్పట్లో కార్మిక శాఖ మంత్రిగా ఉన్న అచ్చెన్నాయుడు పాత్రపై సర్వత్రా చర్చ జరుగుతోంది. సహజంగానే నాకు ఏపాపమూ తెలియదని, తాను పరిశుద్ధాత్మ స్వరూపుడినని అచ్చెన్న అంటున్నారు. అదే సమయంలో మిగిలిన మాజీలు అచ్చెన్నకు సపోర్టుగా గళమెత్తుతున్నారు. జగన్మోహన రెడ్డి పాలనపై విరుచుకు పడుతున్నందునే.. .అచ్చెన్నను కేసుల్లో ఇరికించడానికి ప్రయత్నిస్తున్నారని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అంటున్నారు.

జగన్మోహన రెడ్డి ప్రభుత్వం ఏర్పడి తొమ్మిదినెలలు గడిచాయి. ఇప్పటిదాకా గరిష్టంగా ప్రజా సంక్షేమ కార్యక్రమాల మీదనే దృష్టి సారించారు. ఇప్పుడిప్పుడే అవన్నీ గాడిలో పడుతున్నాయి. ఇపుడిక పాత ప్రభుత్వపు అక్రమాలు అరాచకాల మీద దృష్టి సారించినట్లుగా కనిపిస్తోంది. ఇప్పుడు ఈఎస్ఐ కొనుగోళ్లలో 70 కోట్లు దిగమింగిన వైనం బయటకు వచ్చింది. ఇది శ్రీకారం మాత్రమే అనే అభిప్రాయం ప్రభుత్వ వర్గాల నుంచి వినిపిస్తోంది.

అన్ని ప్రభుత్వ శాఖల్లోనూ గత పాలకుల హయాంలో జరిగిన నిర్ణయాలు, వాటి వెనుక ఉన్న అవకతవకలు అన్నింటిమీద దృష్టి పెడుతున్నారు. సాగునీటి ప్రాజెక్టులు, నిర్మాణాలు కాంట్రాక్టుల విషయంలోనూ అప్పట్లోనూ అనేక మతలబులు పుకార్లు వచ్చాయి. దేవినేని ఉమా గురించి కూడా కొత్త వివరాలు బయటకు వస్తాయనేది సమాచారం. ఆయన ముందస్తుగానే డిఫెన్సులోకి వెళ్లినట్లుగా.. అచ్చెన్నాయుడుకు మద్దతుగా మాట్లాడుతున్నారనే అభిప్రాయం వినిపిస్తోంది.