మార్చి నెల మొత్తం ఎన్నికల హడావిడే!

మార్చినెల మొత్తం స్థానిక సంస్థలకు ఎన్నికల హడావిడి రాష్ట్రాన్ని ముంచెత్తనుంది. స్థానిక సంస్థల ఎన్నికలన్నింటినీ… తప్పనిసరిగా మార్చినెలలో పూర్తిచేయాల్సిన అవసరం ప్రభుత్వం మీద ఉంది. ఈ ఎన్నికలకు సంబంధించి ఉన్న పిటిషన్లపై శుక్రవారం లేదా…

మార్చినెల మొత్తం స్థానిక సంస్థలకు ఎన్నికల హడావిడి రాష్ట్రాన్ని ముంచెత్తనుంది. స్థానిక సంస్థల ఎన్నికలన్నింటినీ… తప్పనిసరిగా మార్చినెలలో పూర్తిచేయాల్సిన అవసరం ప్రభుత్వం మీద ఉంది. ఈ ఎన్నికలకు సంబంధించి ఉన్న పిటిషన్లపై శుక్రవారం లేదా సోమవారం నాటికి హైకోర్టు తీర్పు చెబుతుంది. తక్షణం ఎన్నికల నిర్వహణకు రంగంలో  దిగడానికి అధికార యంత్రాంగం సిద్ధంగా ఉంది. మార్చిలోగా స్థానిక ఎన్నికలు పూర్తికాకపోతే గనుక.. కేంద్రప్రభుత్వం నుంచి రావాల్సిన 3214 కోట్ల ఆర్థిక సంఘం నిధులు మురిగిపోతాయి. అందుకే ఈ హడావిడి.

స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి పార్టీలు కూడా పూర్తిస్థాయిలో సమాయత్తం అవుతున్నాయి. జగన్మోహన రెడ్డి ఇదివరకే పార్టీ పరంగా సమీక్ష సమావేశాలు కూడా నిర్వహించారు. ఈ ఎన్నికల్లోనైనా ధనప్రవాహానికి అడ్డుకట్ట వేయాలని కూడా పిలుపు ఇచ్చారు. ప్రభుత్వం ఇన్ని రకాల సంక్షేమ పథకాలు అమలుచేస్తున్న సమయంలో.. ప్రజలకు ఇంకా డబ్బు తీసుకుని ఓట్లు వేయాల్సిన అగత్యం లేదని.. అందుకే స్వచ్ఛమైన రాజకీయాలను సృజించే ప్రయత్నానికి స్థానిక ఎన్నికలతో శ్రీకారం చుట్టాలని జగన్ తన సహచరులకు పిలుపు ఇచ్చారు.

అదే సమయంలో తెలుగుదేశం దళాలు మాత్రం స్థానిక ఎన్నికలను తీవ్రంగా పరిగణిస్తున్నాయి. ఈ ఎన్నికల్లో  గెలుపోటముల వల్ల వారికి లాభించేది ఏమీ లేకపోయినప్పటికీ.. పైచేయి సాధిస్తే.. 9 నెలల్లోనే జగన్మోహన రెడ్డి సర్కారు భ్రష్టు పట్టిపోయిదని, ప్రజా తిరస్కారానికి గురైందని బురద చల్లడానికి వారికి ఆస్కారం దొరుకుతుంది. అందుకే స్థానిక ఎన్నికల మీద పెద్ద కసరత్తే చేస్తున్నారు.

ఈ స్థానిక ఎన్నికల్లో కొత్త ట్విస్టు ఏంటంటే.. భారతీయ జనతా పార్టీ- జనసేన కలిసి పోటీచేయబోతున్నాయి. రాష్ట్రంలోని అన్ని స్థానాలకు పోటీచేస్తామని ఇరు పార్టీల నాయకులు వేర్వేరు సందర్భాల్లో ప్రకటించారు. గత ఎన్నికల్లో 7 శాతం ఓట్లు ఇద్దరికీ కలిపి వచ్చాయి. తమ ఓటు బ్యాంకును మెరుగుపరచుకోగలమా అనేది ఒక్కటే వారి కోరిక. వారి కాంబినేషన్  ప్రజల్లో ఎలాంటి ప్రభావం చూపిస్తున్నదో క్రాస్ చెక్ చేసుకోవడానికి వారికి ఈ ఎన్నికలు ఉపకరిస్తాయే తప్ప.. మరో రకంగా పార్టీలకు ఒరిగేది లేదు.

ఏరకంగా చూసినా… మార్చి నెల మొత్తం స్థానిక ఎన్నికల హడావిడితోనే గడిచిపోయే వాతావరణం కనిపిస్తోంది. ఈ ఎన్నికలు బడ్జెట్ సమావేశాలకు ఆటంకం కలిగించేట్లయితే గనుక.. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ తో ముందుకు వెళ్లడానికి కూడా ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకుంటోంది.

సీన్ రివర్స్ అయింది..!