' తుప్పు సైకిళ్ళపై గంటా శీను గణగణా..! 12 కోట్ల కొనుగోళ్ళలో 5 కోట్ల అవినీతి!
ఎస్ కే బైక్స్ నుంచి కొనవద్దని బ్లాక్ లిస్టు చేసినా.. బ్లాక్ మనీ కోసం తెగ తొక్కేశాడని ఫిర్యాదుల వెల్లువ..!'
ఇదీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వి.విజయసాయిరెడ్డి తాజా ట్వీట్. తెలుగుదేశం పార్టీ హయాంలో సైకిళ్లు, సుత్తులు, కొడవళ్లు పంచడం రివాజు. వాటిల్లో కూడా స్కామ్ ఆరోపణలు ఉండనే ఉంటాయి. ఈ క్రమంలో ఇప్పుడు ఈ అంశం కూడా తెరమీదకు రావడం గమనార్హం.
ప్రత్యేకించి ఇప్పటికే ఇద్దరు మాజీ మంత్రులు జైల్లో ఉన్నారు. మరో మాజీ మంత్రి కూడా అదే రూట్లో ఉన్నారనే వార్తలూ వస్తున్నాయి. ఈఎస్ఐ స్కామ్ లో పితాని సత్యనారాయణ హయాం గురించి విచారణ సాగుతూ ఉందని సమాచారం. ఇప్పుడు మరో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు గురించి విజయసాయిరెడ్డి ప్రస్తావించడం గమనార్హం.
12 కోట్ల రూపాయల కొనుళ్లలో ఐదు కోట్ల రూపాయల అవినీతి అని ఆయన పేర్కొన్నారు. ఈఎస్ఐ స్కామ్ లో కూడా బ్లాక్ లిస్టులో ఉన్న కంపెనీల నుంచి కొనుగోళ్ల అంశమే హైలెట్ అవుతోంది. ఇలాంటి క్రమంలో సైకిళ్ల స్కామ్ లో కూడా మళ్లీ అలాంటి అంశమే వార్తల్లోకి రావడం గమనార్హం. మరి ఈ సైకిళ్ల స్కామ్ ఎంత వరకూ వెళ్తుందో? మరో మాజీ మంత్రి కూడా అరెస్టవుతారా? అనేది చర్చనీయాంశంగా మారిందిప్పుడు.