కూటమి ప్రభుత్వానికి సంక్షేమ పథకాల అమలు భారంగా మారుతోంది. అందుకే రూ.4 వేల పింఛన్ మినహాయిస్తే ఏ ఒక్క సంక్షేమ పథకం గురించి ఇంత వరకూ కూటమి పెద్దలు నోరు తెరవలేదు. పైగా సంక్షేమ పథకాలు ప్రభుత్వాలకు బారంగా మారుతున్నాయని, ఈ విషయమై దేశ వ్యాప్తంగా చర్చ జరగాలంటూ టీడీపీ ఎమ్మెల్యేలు సన్నాయి నొక్కులు నొక్కడాన్ని గమనించాలి.
జగన్ సర్కార్ ఆర్థిక అరాచకం వల్ల సంక్షేమ పథకాల అమలు మోయలేని భారంగా మారిందని ప్రభుత్వ పెద్దలు తరచూ మాట్లాడుతున్నారు. ప్రభుత్వంలో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్న నాయకులు, అలాగే అనుకూల మీడియా ప్రచారం చూస్తుంటే, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విచ్చలవిడిగా అప్పులు చేశారని, దీంతో సంక్షేమ పథకాలు అమలు చేయలేని దుస్థితి దాపురించిందని చెప్పడానికి సిద్ధమవుతున్నట్టు కనిపిస్తోంది.
జగన్‌పై నెపాన్ని నెట్టి, సంక్షేమ పథకాల్లో కోత విధించడానికే తీవ్రంగా కసరత్తు చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. మరోవైపు కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాలను ఎప్పటి నుంచి అమలు చేస్తుందా? అని ప్రజానీకం ఎదురు చూస్తోంది. జగన్ అధికారంలో ఉండి వుంటే అమ్మ ఒడి, రైతు భరోసా నిధులు పడేవని ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో చర్చించుంటున్నారు. సూపర్ సిక్స్ పథకాలకు ఆకర్షితులై కూటమికి పట్టం కట్టామని, ఇప్పుడు ఏమవుతుందో అనే ఆందోళన సంక్షేమ పథకాల లబ్ధిదారుల్లో నెలకుంది.
విద్యా సంవత్సరం ప్రారంభం కావడం, అలాగే వర్షాలు కురిసి రైతాంగం పంటల సాగులో నిమగ్నమైంది. ఇప్పుడు అమ్మ ఒడి, రైతు భరోసా నిధుల కోసం మహిళలు, రైతులు ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే గత ఐదేళ్లలో జగన్ హయాంలో సీజన్‌కు తగ్గట్టు బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా నిధుల్ని జమ చేస్తూ వచ్చారు. దానికి జనం అలవాటు పడ్డారు. జగన్‌కు మించి ఆర్థిక లబ్ధి కలిగిస్తామని చెప్పడంతో, వాళ్లంతా కూటమికి జై కొట్టారు.
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఐదు సంతకాలు చేసినప్పటికీ, అందులో పింఛన్ పెంపు మాత్రమే కొన్ని వర్గాల్లో సంతోషాన్ని మిగిల్చింది. మెగా డీఎస్సీకి సంబంధించి ప్రకటన… నిరుద్యోగ ఉపాధ్యాయ వర్గాల్లో ఆనందాన్ని ఇచ్చింది. మిగిలినవి ఆర్థిక ప్రయోజనాలకు సంబంధించినవి కావు. అందుకే ఆర్థిక ప్రయోజనాలకు సంబంధించిన ప్రకటనల కోసం జనం ఎదురు చూస్తున్నారు.
మరోవైపు ఒరిస్సాలో పింఛన్ కేవలం వెయ్యి రూపాయలు మాత్రమే అని, ఏపీలో రూ.4 వేలు ఎందుకు ఇవ్వాలని కూటమి అనుకూల నాయకులు వారి మీడియా ముందు మాట్లాడుతున్నారు. ఇలా సంక్షేమ పథకాలను ఏ విధంగా అటకెక్కించాలనే ఆలోచన తప్ప, అమలు చేయాలనే చిత్తశుద్ధి కనిపించడం లేదనే టాక్ మొదలైంది. దీనంతటికి జగనే కారణమని చెప్పడానికి రెడీ అయ్యారు.ఎవరెన్ని మాట్లాడినా, అంతిమంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి మాటే ఫైనల్. ఆయన మాట కోసం జనం ఎదురు చూస్తున్నారు.
Lack of opposition might be giving government the audacity of dumping the schemes that were promised during elections but the reality is that failing to implement the welfare schemes as promised will become a boon for Jagan within the next elections. Please Beware and try to balance both welfare and development.
నథింగ్ will happen people are looking for good governance jobs .rates control law and order control etc …. Not silly scheme like jagan did the alliance is focusing on development that’s why people gave the power
How come jobs come from the air. Even CBN was canvassing that he developed Hitec city and now fruits are coming. It is just boasting and claiming others achievements. Congress started IT spending in United Andhra. Started its development but CBN got backing major media.
CBN never stick to his promises in life. Not sure how people believed.
Especially youth thought he will get bulk IT jobs to Andhra, which he was unable to do in 14-19.
బట్ హే developed the state that’s y. He came back to power with thumping majority .inkaa ప్రజల తీర్పు నీకు అర్థం కాలేదు .మంచిది ఇలాగే ఉండండి భ్రమల్లో
did you delete all your previous comments? Such a coward
Why did you delete all your previous comments
Yes సంక్షేమం కి లిమిట్ ఉంది. టిడిపి ఓటర్ నాడి సరిగ్గా తెక్సుకోకుండ ప్రతి ఆడ పిల్ల కు 1500. 50 ఏళ్లకే పెన్షన్ లాంటి చెత్త పథకాలు ప్రామిస్ చేసారు . అవి సంక్షేమం అనొద్దు. వృద్ధాప్య పెన్షన్ల లు తప్ప మిగతావి లంచాలు అనాలి. జనాలకు జగన్ అవే ఇచ్చే వాడు .వితే వేస్తీస్తారు ఇంకా ఏమయినా చేసుకోవచ్చు అనుకున్నాడు వొది.పోయాడు ప్రజలకు.కావాల్సింది మంచి పాలన.ఉపాధి నాన్య మయిన.రోడ్డు లు. లక్షల్లో ఉద్యోగాలు ధరల అదుపు చెయ్యడం శాంతి భద్రత లు అని అర్థం చేసుకోవడమే 24 లో ఇచ్చిన తీర్పు ఉద్దేశం
Jagan believed that his manifesto got him to power and hence focused only on implementing welfare schemes and now kootami is believing otherwise even though their manifesto has promised lot of welfare schemes both of which are wrong.
There needs to be a balance of welfare and development. Secondly, lakhs of government jobs cannot be created and this will need support from private sector which will not happen on day one and will need time. Lastly, both central and state government need to focus on controlling prices as there had been more price increases since the new government took charge.
Due to jagans egoism and never listen to others advise turn him into a whipping boy so CBN and Pk skip every promise by throwing blame on jagan