Advertisement

Advertisement


Home > Politics - Gossip

తెలివైన మోసగాళ్ల తాట ఒలిచే రకం!

తెలివైన మోసగాళ్ల తాట ఒలిచే రకం!

జగన్ ప్రభుత్వం సిట్ ఏర్పాటుచేయగానే.. దానికి సంబంధించిన అనేక చర్చోపచర్చలు నడుస్తున్నాయి. సదరు సిట్ కు నిర్దేశించిన విధివిధానాలు, అధికారాలు మాత్రం స్పష్టంగా నోటిఫికేషన్ లోనే ఉన్నాయి. అయితే.. సదరు సిట్ కు సారథ్యం వహిస్తున్న రఘురామిరెడ్డి ఎవరు? ఎక్కడివాడు? జగన్ కు- అతనికి ఉన్న కనెక్షన్ ఏమిటి? ఆయనకు సిట్ సారథ్యాన్ని అప్పగించడం ఒక కుట్రగా ప్రచారం చేయాలంటే.. ఏం చేయాలి? ఏం తెలుసుకోవాలి...? అనే పనిలో పచ్చదళాలన్నీ ఒక రోజంతా గడిపాయి. కానీ వారు సాధించిందేమీ లేదు. సిట్ సారథి రఘురామిరెడ్డి, సీఎం జగన్మోహన రెడ్డి అనుకూల వ్యక్తి అని బురద చల్లడానికి వారికేమీ దొరకలేదు.

అయితే.. రఘురామిరెడ్డి అంటే పోలీసు శాఖలో ఒక మంచి గుర్తింపు ఉంది. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో పదో తరగతి వరకు చదివిన రఘురామిరెడ్డి ఆ తర్వాత ఎంబీబీఎస్ చేశారు. ఆ పిమ్మటే సివిల్స్ రాసి ఐపీఎస్ కు సెలక్టయ్యారు. గతంలో ఎస్పీగా కూడా పనిచేసిన ఆయన ప్రస్తుతం ఇంటెలిజెన్స్ డీఐజీగా ఉన్నారు. ఆయన ట్రాక్ రికార్డు చాలా స్పష్టంగానే ఉంది.

అయితే అతి తెలివితేటలు గల ఆర్థిక నేరగాళ్ల భరతం పట్టడంలో రఘురామిరెడ్డి సిద్ధహస్తుడు. ఆమ్వే గొలుసుకట్టు వ్యాపారాల్లో జరిగే వందల వేల కోట్ల రూపాయల మోసాలు ఎలా బట్టబయలయ్యాయో అందరికీ తెలుసు. అప్పట్లో అది పెద్ద సంచలనం. రఘురామిరెడ్డి కర్నూలు జిల్లా ఎస్పీగా ఉన్న సమయంలోనే వాటి భరతం పట్టారు. ఎన్ మార్ట్, నక్షత్ర, అక్షయగోల్డ్ వంటి అతితెలివైన ఆర్థిక నేరాలన్నింటి గుట్టు రాబట్టిన చరిత్ర ఆయనకుంది.

తమాషా ఏంటంటే.. ఆమ్వే నుంచి అక్షయ గోల్డ్ వరకు... రఘురామిరెడ్డి గతంలో డీల్ చేసిన కేసులు అన్నింటిలోనూ ఒక సారూప్యత ఉంది. ఇవన్నీ కూడా.. ప్రజల్లోని అమాయకత్వాన్ని, ఆశను ఆలంబనగా చేసుకుని, ఆర్థికంగా మోసాలకు పాల్పడే వ్యవహారాలే. ప్రజలకు పెద్ద పెద్ద లాభాల ఆశ చూపించి, బురిడీ కొట్టించి.. దోచుకోవడమే ధ్యేయంగా కలిగిన వ్యాపారిలు అవి. వాటన్నినంటినీ రఘురామిరెడ్డి చాలా చాకచక్యంగా పరిష్కరించుకుంటూ వచ్చారు.

ఇప్పుడు సిట్ పరిధిలోకి వచ్చే అమరావతి భూకుంభకోణాలు కూడా అచ్చంగా ఇలాంటి- ప్రజల్లో ఆశల్ని పెంచి వారికి దక్కే లాభాలను ఎరగా చూపించి.. నడమంత్రంగా ఇతరులు దోచుకున్న నేరాలే. సదరు ఆర్థిక నేరాల్లో ఎన్ని వక్ర, దొంగమార్గాలు అనుసరించి ఉన్నప్పటికీ.. అలాంటి వాటి భరతం పట్టడం, నిగ్గు తేల్చడం రఘురామిరెడ్డికి వెన్నతో పెట్టిన విద్యే అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

మోడీ దోచుకొని తినమని చెప్పాడా నీకు

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?