దిద్దుకున్నారు సరే.. ఎందుకు పొరబడినట్లు?

జగన్ టీమ్ ఒక్కనెల రోజుల వ్యవధిలోనే చేసిన పొరబాటును దిద్దుకునే ప్రయత్నం చేసింది. ప్రభుత్వానికి ఆర్థిక వనరులను పెంచుకునే ప్రయత్నంలో భాగంగా.. పన్నుల పెంపు రూపేణా చిన్న సవరణలు చేసిన ప్రభుత్వం.. కేవలం నెల…

జగన్ టీమ్ ఒక్కనెల రోజుల వ్యవధిలోనే చేసిన పొరబాటును దిద్దుకునే ప్రయత్నం చేసింది. ప్రభుత్వానికి ఆర్థిక వనరులను పెంచుకునే ప్రయత్నంలో భాగంగా.. పన్నుల పెంపు రూపేణా చిన్న సవరణలు చేసిన ప్రభుత్వం.. కేవలం నెల రోజుల వ్యవధిలోనే ఆ విధానాన్ని మళ్లీ మార్చింది. ఇలా చేయడం వలన కేవలం నెలరోజుల వ్యవధిలో రెండుసార్లు పన్నులు పెంచిన ప్రభుత్వంగా పేరు తెచ్చుకుంది. నిజానికి తాజాగా తీసుకున్న నిర్ణయం.. పాత నిర్ణయంలో దొర్లిన పొరబాటును సరిదిద్దే ప్రయత్నం మాత్రమే. ఇవాళ దిద్దుకోవడం మంచి పనే.. కానీ నెల కిందట ఎలా పొరబడ్డారు. జగన్ టీమ్ ఆ మాత్రం లెక్కలు వేసుకోకుండా.. నిర్ణయాన్ని ఎందుకు ప్రకటించింది…అనేదే ఇప్పుడు చర్చనీయాంశంగా ఉంది.

అవును ఇదంతా పెట్రో ధరలపై పెంచిన పన్నుల గురించినదే.  తాజాగా పెట్రోలియం ఉత్పత్తుల ధరలపై పన్నులను సవరిస్తూ.. వాటిమీద రాష్ట్ర ప్రభుత్వం అదనంగా విధించే స్థిరధరను కూడా సర్కారు పెంచింది. ‘స్థిర ధర’ అనే దానిని జనవరి 29న పూర్తిగా తొలగించి.. కేవలం పన్నులను మాత్రం పెంచారు. ఇప్పుడు మళ్లీ పన్నులను యథాతథంగా పూర్వంలాగా ఉంచి, స్థిరధరలను మాత్రం పెంచారు. రెండు దశల్లోనూ పెంచిన తర్వాత.. పెట్రోలు లీటరుపై 72 పైసలు, డీజిలుపై 77 పైసల భారం పడుతుంది. ఇది కొందరికి తక్కువగానే కనిపించవచ్చు. ప్రభుత్వానికి మాత్రం ఏడాదికి 400 నుంచి 500 కోట్ల రూపాయల లాభం వస్తుందనేది అంచనా.

ప్రభుత్వాలు ఆర్థిక వనరులను పరిపుష్టం చేసుకునే ప్రయత్నాల్లో భాగంగా పన్నులు పెంచడం కొత్త సంగతి కాదు. కాకపోతే.. జనవరి 29న అంటే కేవలం నెల రోజుల కిందటే విధానం మార్చారు. వ్యాట్ ను పెంచారు. స్థిర ధర తొలగించారు. దానివల్ల మొత్తంగా కలిపేసరికి పెట్రోలుపై కేవలం 4 పైసలు, డీజిలుపై 30 పైసలు పెరిగాయి. రాష్ట్రం ఆదాయాన్ని పెంచుకోజూసినప్పుడు ఇది చాలా తక్కువ పెంపు. అందుకే ఇప్పుడు పన్నులను పాత పద్ధతిలో ఉంచి.. స్థిరధరలో పెట్రోలుపై 2.76గా , డీజిలుపై 3.07గా పెంచారు.

చర్చ పెంచిన దాన్ని గురించి కాదు గానీ.. ప్రభుత్వానికి ఆదాయం పెరిగే అవకాశం ఎంతమాత్రమూ లేకుండా… జనవరిలో ఒకసారి పన్ను విధానాన్ని మార్చడం అనే పొరబాటు ఎందుకు చేశారన్నదాని గురించే! అధికారులు ఆ మాత్రం కనీస లెక్కలు వేసుకోకుండా.. గుడ్డిగా ఎలా వ్యవహరించారు. దీనివల్ల పెరిగిన మొత్తం స్వల్పమే అయినా.. నెల వ్యవధిలో ప్రభుత్వం రెండు సార్లు ధరలు పెంచిందనే ముద్ర పడేలా ఎందుకు చేశారు? ఇలాంటి తడబాట్లు ముందుముందు లేకుండా అధికార్లు మరింత నిర్దిష్టమైన చర్యలు తీసుకుంటే మంచిది.

ఇంటి ప‌నుల‌తో పాటు బాడీ మసాజ్ లు చేయిచుకుంటున్న యాంక‌ర్‌ ?

అసిస్టెంట్ డైరెక్టరుగా ఉన్నపుడే ప్రొడ్యూసర్స్ పై కంప్లైంట్ ఇచ్చేవాడు