సీఎంను పూర్తి డమ్మీగా మార్చేశారా!

ఇప్పటికే ముగ్గురు డిప్యూటీ సీఎంలను నియమించారు. మరో ఇద్దరు డిప్యూటీ సీఎంలను నియమించనున్నారట. ఏపీలో కూడా ఐదుగురు డిప్యూటీ సీఎంలున్నారు. అయితే ఒక ప్రాంతీయ పార్టీ అధినేతగా జగన్ మోహన్ రెడ్డి తను ముఖ్యమంత్రి…

ఇప్పటికే ముగ్గురు డిప్యూటీ సీఎంలను నియమించారు. మరో ఇద్దరు డిప్యూటీ సీఎంలను నియమించనున్నారట. ఏపీలో కూడా ఐదుగురు డిప్యూటీ సీఎంలున్నారు. అయితే ఒక ప్రాంతీయ పార్టీ అధినేతగా జగన్ మోహన్ రెడ్డి తను ముఖ్యమంత్రి పీఠంపై కూర్చుని ఐదుగురు డిప్యూటీ సీఎంలను నియమించుకున్నారు. అది వేరే కథ. అయితే కర్ణాటకలో ఇప్పటికే ముగ్గురు, ఇకపై మరో ఇద్దరు డిప్యూటీ సీఎంలను కూర్చోబెట్టనుందట కమలం పార్టీ అధిష్టానం.

డెబ్బై ఐదేళ్ల వయసు దాటితే ఎవరూ కీలక పదవుల్లో ఉండకూడదని రూల్ పాస్ చేస్తూ వచ్చిన మోడీ, అమిత్ షాలు.. యడియూరప్పకు మాత్రం ప్రత్యేక అవకాశం ఇచ్చారు. ఆయన వయసు దాటినా ఆయనను సీఎంగా చేశారు. అయితే సీఎంగా చేశారనే మాటే కానీ.. డిప్యూటీలను నియమించి ఆయనను కట్టడి చేస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి.

అంతేకాదట.. యడియూరప్ప ఏ విషయంలోనూ సొంత నిర్ణయం తీసుకోవడానికి లేదట. ప్రత్యేకంగా అక్కడ సంఘ్ పరివార్ సభ్యుడు ఒకరిని సలహాదారుగా నియమించడం కూడా జరిగింది. మొత్తం పాలన అంతా ఆయన కనుసన్నల్లో సాగుతుందని, సీఎం సంతకం పెట్టాల్సిన ప్రతి ఫైలూ ఆయనను దాటుకునే వెళ్తుందని టాక్ వినిపిస్తూ ఉంది.

ఇలా యడియూరప్పను మరింత డమ్మీగా మార్చేశారని అభిప్రాయాలు వినిపిస్తూ ఉన్నాయి. వెనుకటికి కాంగ్రెస్ హైకమాండ్ వివిధ రాష్ట్రాల్లో తన కనుసన్నల్లో పాలనను నడిపించేది. ఇప్పుడు కర్ణాటకలో మొత్తం అమిత్ షా కనుసన్నల్లో పాలన నడుస్తోందని.. యడియూరప్ప కేవలం పేరుకు మాత్రమే ముఖ్యమంత్రి అని అక్కడివారు అనుకుంటున్నారు.

ఇక ఇటీవల అమిత్ షా చేసిన హిందీ వ్యాఖ్యలను ఖండిస్తున్నట్టుగా యడియూరప్ప మాట్లాడారు. కర్ణాటకలో కన్నడే ఫస్ట్ అని.. ఆ తర్వాతే ఏదైనా అని తేల్చారు. ఆ మాటలు కూడా అమిత్ షాకు యడియూరప్పపై మరింత కోపాన్ని తెప్పించాయని బీజేపీ వాళ్లే అనుకుంటున్నారట!

సినీ ఇండస్ట్రీలో ఈ ఫీలింగ్స్‌ మరింత ఎక్కువ