గడువు దగ్గర పడింది.. ‘హై పవర్’ ఏం తేలుస్తుంది?

ఈరోజు మరోసారి సమావేశం కాబోతోంది 16 మంది సభ్యులతో కూడిన హై-పవర్ కమిటీ. అమరావతి ప్రాంతంలో రైతుల నిరసనలు హోరెత్తుతున్న వేళ, మరోవైపు గడువు తేదీ దగ్గరపడుతున్న నేపథ్యంలో.. ఇవాళ్టి సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది.…

ఈరోజు మరోసారి సమావేశం కాబోతోంది 16 మంది సభ్యులతో కూడిన హై-పవర్ కమిటీ. అమరావతి ప్రాంతంలో రైతుల నిరసనలు హోరెత్తుతున్న వేళ, మరోవైపు గడువు తేదీ దగ్గరపడుతున్న నేపథ్యంలో.. ఇవాళ్టి సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది. మరీ ముఖ్యంగా ఇవాళ్టి భేటీలో రాజధాని అంశంపై కమిటీ కీలక నిర్ణయాలు తీసుకొని ప్రభుత్వానికి సిఫార్స్ చేయాలని అనుకుంటోంది. కమిటీ ఏర్పడిన తర్వాత భేటీ అవ్వడం ఇది మూడోసారి.

ఇప్పటికే రాజధాని అంశంపై రెండుసార్లు సమావేశమైన హై-పవర్ కమిటీ.. జీఎన్ రావు నివేదిక, బోస్టన్ నివేదికలపై సమగ్రంగా అధ్యయనం నిర్వహించింది. వాటికి సంబంధించి తుది తీర్మానాల్ని ఈరోజు చేసే అవకాశం ఉంది. అధికార వికేంద్రీకరణతో పాటు అమరావతి రైతులకు ప్యాకేజీ కల్పించే అంశంపై సుదీర్ఘంగా చర్చించబోతున్నారు. దీంతో పాటు అమరావతి నుంచి ఉద్యోగుల్ని విశాఖకు ఎలా తరలించాలనే అంశంపై కూడా చర్చించబోతున్నట్టు తెలుస్తోంది.

కమిటీ నివేదిక సమర్పించడానికి తుది గడవు 20వ తేదీ. కానీ అదే తేదీన కేబినెట్ మీటింగ్ పెట్టాలని ఆలోచిస్తోంది జగన్ సర్కార్. 18, 19 తేదీలు వీకెండ్ కాబట్టి.. హై-పవర్ కమిటీ తన సిఫార్సుల్ని మరో 4 రోజుల్లో ప్రభుత్వానికి అందజేసే అవకాశం ఉంది. సో.. ఈరోజు కాకుండా, ఈ 4 రోజుల్లో మరొక్కసారి మాత్రమే కమిటీ భేటీ అయ్యే అవకాశం ఉంది.

అమరావతిలో రైతులు నిరసన తెలుపుతున్న నేపథ్యంలో, వాళ్లకు ప్రకటించే ప్యాకేజీపై ఈరోజు ఎట్టిపరిస్థితుల్లో ఓ నిర్ణయం తీసుకోవాలని కమిటీ నిర్ణయించింది. అంతేకాకుండా, రాజధాని అంశంతో సంబంధం లేకుండా, హై-పవర్ కమిటీ ఇచ్చే తుది నివేదిక వరకు ఆగకుండా.. ఆ నిర్ణయాన్ని ప్రభుత్వం తరఫున రేపోమాపో వెల్లడించే అవకాశం కూడా ఉందంటున్నారు కమిటీ సభ్యులు.

తార‌క్ మీరు ఎప్పూడు క‌ల‌సి సినిమాలో న‌టిస్తూనారు