ప్ర‌క‌టించ‌కుండా పెళ్లి చేసుకుంటే వ‌చ్చే ప‌బ్లిసిటీనే వేరు!

దాదాపు నెల రోజుల నుంచి క‌త్రినాకైఫ్  విక్కీ కౌశ‌ల్ ల పెళ్లి గురించి అవిశ్రాంతంగా రిపోర్ట్ చేస్తోంది హిందీ మీడియా. ఈ విష‌యంలో బాలీవుడ్ మీడియా, జాతీయ మీడియాగా చెప్పుకునే హిందీ మీడియా అన‌విగాని…

దాదాపు నెల రోజుల నుంచి క‌త్రినాకైఫ్  విక్కీ కౌశ‌ల్ ల పెళ్లి గురించి అవిశ్రాంతంగా రిపోర్ట్ చేస్తోంది హిందీ మీడియా. ఈ విష‌యంలో బాలీవుడ్ మీడియా, జాతీయ మీడియాగా చెప్పుకునే హిందీ మీడియా అన‌విగాని విష‌యాల‌ను ఎక్స్ క్లూజివ్ గా ఇస్తోంది. ఎన్ని హోట‌ళ్లు బుక్ చేశారు, ఎవ‌రెవ‌రు అతిథులుగా వస్తారు, ఎలాంటి వేడుక జ‌ర‌గ‌బోతోంది?

వేడుక వైపుకు సెల్ ఫోన్ల‌ను తీసుకెళ్ల‌నిస్తారా లేదా, వీరి పెళ్లి వేడుక స‌మీపంలో డ్రోన్ లు ఎగిరితే.. వాటిని కాల్చేస్తారా లేక అలాగే ఎగ‌రనిరాస్తా.. అనే క‌బుర్ల‌తో మొద‌లు, వీరి పెళ్లికి స‌ల్మాన్ ఖాన్ వెళ్తాడా వెళ్ల‌డా? ఈ పెళ్లి గురించి స‌ల్మాన్ చెల్లెళ్లు ఏమంటున్నారు? ఈ పెళ్లికి అలియా భ‌ట్ వెళ్లానుకుంటోందా లేదా? టికెట్లు బుక్ అయ్యాయా లేదా! విక్కీ, క‌త్రినా పెళ్లి గురించి మీరు తెల‌సుకోవాల్సిన ప‌ది విష‌యాలు.. అంటూ వాటిని మీడియానే డిసైడ్ చేసి వీక్ష‌కుల‌కు జ్ఞాన‌బోధ చేస్తోంది!

ఒక‌వేళ ఈ పెళ్లి గురించి క‌త్రినా గ‌నుక మీడియా ముందుకు వ‌చ్చి ఒక ప్ర‌క‌ట‌న చేసి ఉంటేనో, లేదా సోష‌ల్ మీడియాలో ఒక పోస్టు పెట్టేసి ఉంటేనో.. మీడియాకు ఇంత ప‌ని ఉండేది కాదు! ఇన్ని విష‌యాల‌ను శోధించి, ప‌రిశోధించి చెప్పే అవ‌కాశం ఉండేది కాదు. వారు ఏ విష‌యాన్నీ చెప్ప‌డం లేదు. అయితే మీడియా మాత్రం అన్ని విష‌యాల‌నూ తెలుసుకుని రాస్తోంది. ఉన్న‌వి లేనివీ రాసుకోవ‌డానికి బాగా అవ‌కాశం ల‌భించింది. ఈ విష‌యంలో ఎవ‌రికి వారు త‌మ‌దే ఎక్స్ క్లూజివ్ స‌మాచారం అని అంటున్నారు. పోటీలు ప‌డి మ‌రీ క‌త్రినా పెళ్లికి క‌వ‌రేజీ ఇస్తున్నారు.

ప్ర‌క‌టించ‌కుండా పెళ్లి చేసుకుంటే.. సెల‌బ్రిటీల పెళ్లికి మీడియా అప‌రిమిత‌మైన క‌వ‌రేజీ ఇస్తుంద‌ని ఇలా క్లారిటీ వ‌స్తోంది. ఇంతేనా.. ఇక పెళ్లి వేడుక రోజున ఇంకా ఎలాంటి హ‌డావుడి ఉంటుందో, ఇంకెంత ర‌చ్చ చేస్తుందో మీడియా. లైవ్ బ్లాగ్ పెట్టి.. ప్ర‌తి నిమిషం అప్ డేట్ ను ఇవ్వ‌డానికి హిందీ మీడియా వ‌ర్గాలు పోటీప‌డ‌తాయ‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు.

మినిట్ టు మినిట్ అప్ డేట్స్ ఉంటాయ‌న‌డంలో ఆశ్చ‌ర్యం లేదు. త‌మ గురించి మీడియా బాగా క‌వ‌రేజ్ చేయాలంటే.. త‌మ ప‌ర్స‌న‌ల్ ఎఫైర్స్ ను కాస్త లో కీ లో ఉంచ‌డం సెల‌బ్రిటీల‌కు అవ‌స‌రం లాగుంది. క‌త్రినా అదే ప‌ని చేసి.. కావాల్సినంత ప‌బ్లిసిటీ పొందుతోంది.