70 మంది అమ్మాయిలతో సెక్స్ ఛాట్.. చివరికి అలా!

ఆన్ లైన్ లో తెలియక, అమాయకత్వంలో మోసపోయేవాళ్లు కొందరైతే.. అత్యాశకు పోయి మోసపోయేవాళ్లు మరికొందరు. ఈ  రెండు కాకుండా మరో కేటగిరీ కూడా ఉంది. అదే బలహీనత. వ్యక్తుల బలహీనతల ఆధారంగా ఆన్ లైన్…

ఆన్ లైన్ లో తెలియక, అమాయకత్వంలో మోసపోయేవాళ్లు కొందరైతే.. అత్యాశకు పోయి మోసపోయేవాళ్లు మరికొందరు. ఈ  రెండు కాకుండా మరో కేటగిరీ కూడా ఉంది. అదే బలహీనత. వ్యక్తుల బలహీనతల ఆధారంగా ఆన్ లైన్ మోసాలకు పాల్పడే వాళ్లు చాలామంది ఉన్నారు. హైదరాబాద్ లో పోలీసులు ఛేదించిన ఓ కేసు ఈ రకానికి చెందిందే.

సుమంత్ మణికొండలో ఉంటాడు. ఓ ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు. అయితే సాయంత్రం అయ్యేసరికి మాత్రం ఇతడు మహిళగా మారిపోతాడు. ఇనస్టాగ్రామ్ లో అమ్మాయి ప్రొఫైల్ తో ఖాతా తెరవడం, అమ్మాయిలకు రిక్వెస్టులు పంపించడం, తిరిగి ఎవరైనా స్పందిస్తే వాళ్లను ముగ్గులోకి దింపడం. ఇదే ఇతగాడి పని.

అలా ఇప్పటివరకు 70 మంది అమ్మాయిలతో సెక్స్ ఛాట్ చేశాడు సుమంత్. వీళ్లలో చాలామంది మహిళల ప్రైవేట్ ఫొటోల్ని సేకరించి, తిరిగి వాళ్లనే బ్లాక్ మెయిల్ చేయడం మొదలుపెట్టాడు. ఇలా కొందరి నుంచి డబ్బు గుంజడంతో పాటు, మరికొందర్ని లైంగికంగా కూడా వేధించాడు. అలా జల్సాగా సాగిపోతున్న సుమంత్ ఆగడాలకు ఓ మహిళ అడ్డుకట్ట వేసింది.

హైదరాబాద్ కూకట్ పల్లికి చెందిన ఓ అమ్మాయిని లైన్లో పెట్టాడు సుమంత్. కొన్నాళ్లు వ్యవహారం బాగానే నడిచింది. కొన్ని రోజులకు సదరు అమ్మాయి ప్రైవేట్ ఫొటోల్ని సేకరించి, వాటితో బ్లాక్ మెయిల్ కు దిగాడు సుమంత్. అయితే ఆ అమ్మాయి మిగతా అమ్మాయిల్లా ఊరుకోలేదు. నేరుగా వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

రంగంలోకి దిగిన పోలీసులు సుమంత్ ను అదుపులోకి తీసుకున్నారు. అతడి ల్యాప్ టాప్, మొబైల్ అన్నీ సీజ్ చేశారు. అలా 70 మందితో సెక్స్ చాట్ చేసిన వ్యక్తి, ప్రస్తుతం పోలీస్ కస్టడీలో ఉన్నాడు.

చంద్ర‌బాబు త‌న స్థాయి మ‌రిచి రాజ‌కీయాలు చేస్తున్నారు

అతి చేస్తోన్న మీడియా