విశాఖ మెగా సిటీ. ఒక విధంగా టూరిజానికి, ఎంటర్టైన్మెంట్ కి కూడా కీలక పాయింట్. విశాఖ ఇపుడు అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతోంది. సీ, ఎయిర్ పోర్ట్, రైల్, రోడ్ కనెక్టివిటీ కలిగిన విశాఖలో పర్యాటక రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు కూడా ఔత్సాహికులు ఆసక్తిని కనబరుస్తున్నారని చెబుతున్నారు.
అదే టైమ్ లో విశాఖలో ఇతర యాక్టివిటీని కూడా పెంచడానికి గల అవకాశాలను పరిశీలిస్తున్నారు. విశాఖలో కార్ రేసింగ్ నిర్వహించేందుకు గల అనుకూల పరిస్థితులను పరిశీలిస్తున్నట్లుగా పర్యాటక మంత్రి అవంతి శ్రీనివాసరావు తెలిపారు.
తాజాగా విశాఖలో జరిగిన నేషనల్ కార్ ర్యాలీ ఈవెంట్ లో ముఖ్య అతిధిగా పాల్గొన్న ఆయన కీలకమైన కామెంట్స్ చేశారు. విశాఖ వంటి మెగా సిటీలో కార్ రేసింగ్ నిర్వహణకు సన్నాహాలు జరుగుతున్నాయని వెల్లడించారు.
అన్ని అనుమతులూ పొందిన తరువాత డిసెంబర్ నెలలో నేషనల్ కార్ రేసింగ్ నిర్వాహకులతో కలసి విశాఖ మెగా కార్ రేసింగ్ నిర్వహించాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉందని చెబుతున్నారు.
మొత్తానికి టూరిజం పరంగా విశాఖను అభివృద్ధి చేయాలనుకుంటున్న క్రమంలో కార్ రేసింగ్ వంటి కొత్త యాక్టివిటీని కూడా సిటీ కల్చర్ లో భాగం చేయాలనుకుంటున్నాట్లుగా తెలుస్తోంది.