సీమ‌కు హైకోర్టు కూడా వ‌ద్దా?

అమ‌రావ‌తి రాజ‌ధాని పేరుతో కొంత మంది పెయిడ్ ఆర్టిస్టులు, టీడీపీ నాయ‌కులు తిరుప‌తిలో క‌వాతు చేయ‌డం, రాయ‌ల‌సీమ మ‌నోభావాల‌ను దెబ్బ‌తియ‌డ‌మే అని ఆంధ్ర‌ప్ర‌దేశ్ అభివృద్ధి పోరాట స‌మితి (ఆప్స్‌) నాయ‌కులు తీవ్రంగా విమ‌ర్శించారు.  Advertisement…

అమ‌రావ‌తి రాజ‌ధాని పేరుతో కొంత మంది పెయిడ్ ఆర్టిస్టులు, టీడీపీ నాయ‌కులు తిరుప‌తిలో క‌వాతు చేయ‌డం, రాయ‌ల‌సీమ మ‌నోభావాల‌ను దెబ్బ‌తియ‌డ‌మే అని ఆంధ్ర‌ప్ర‌దేశ్ అభివృద్ధి పోరాట స‌మితి (ఆప్స్‌) నాయ‌కులు తీవ్రంగా విమ‌ర్శించారు. 

ఆప్స్ ఆధ్వ‌ర్యంలో మంగ‌ళ‌వారం తిరుప‌తి ఎయిర్‌బైపాస్ రోడ్డులోని అన్న‌మ‌య్య స‌ర్కిల్ నుంచి విద్యార్థులు, యువ‌కులు ఎమ్మార్‌ప‌ల్లి కూడ‌లి వ‌ర‌కు భారీ ర్యాలీ నిర్వ‌హించారు.

ఈ సంద‌ర్భంగా ఆప్స్ రాష్ట్ర అధికార ప్ర‌తినిధి ర‌ఫీ హిందూస్థాని, జిల్లా అధ్య‌క్షుడు షేక్ మ‌హ‌మ్మ‌ద్ ర‌ఫీ మాట్లాడుతూ వెనుక‌బ‌డిన రాయ‌ల‌సీమ అభివృద్ధి చెంద‌డం చంద్ర‌బాబుకు ఎంత మాత్రం ఇష్టం లేద‌న్నారు. 

కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయ‌డం వ‌ల్ల చంద్రబాబుకు నష్టం ఏంట‌ని ప్ర‌శ్నించారు. అమ‌రావ‌తి కార్పొరేట్ యాత్రకు కథా, స్క్రీన్ ప్లే, దర్శకత్వం చంద్రబాబేనని అని వారు విమ‌ర్శించారు. అమరావతి రైతుల పేరుతో చిత్తూరు జిల్లాలో యాత్ర చేయడం ఇక్కడి ప్రజల మనోభావాలను దెబ్బ తీయడమే  అన్నారు.

గత సమైక్య రాష్ట్రంలో హైదరాబాద్ ఒక్క నగరాన్నే అభివృద్ధి చేయ‌డం వ‌ల్ల వేర్పాటువాదం ముందుకొచ్చింద‌న్నారు. ప్రస్తుతం అమరావతి ఒక్కటే రాజధానిగా ఏర్పాటు చేస్తే మళ్లీ రాయలసీమ, ఉత్తరాంధ్ర వేర్పాటువాద ఉద్య‌మాలు పుట్టుకొస్తాయ‌న్నారు. రాయలసీమలో హైకోర్టు పెట్టవద్దని టీడీపీ, బీజేపీ, కమ్యూనిస్టులు చెప్పగలరా? అని ప్ర‌శ్నించారు.  

రాయలసీమ అభివృద్ధి కోసం 1000 కోట్ల ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని కోరిన కమ్యూనిస్టులు కూడా రాయలసీమకు అన్యాయం చేస్తున్నారని విమ‌ర్శించారు. ఈ కార్య‌క్ర‌మంలో  రచయిత్రి డాక్ట‌ర్‌ మస్తానమ్మ, ఆప్స్ జిల్లా కార్యదర్శి  వినాయక రెడ్డి, ముని చంద్రా రెడ్డి, పెదరాయుడు, యశోద, రాజేష్, ధనలక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.