శ్రీకాకుళం ఎంపీ, జూనియర్ ఎర్రన్నాయుడు అయిన రామ్మోహననాయుడు పాము విరగకుండా కర్ర చావకుండా ఒక న్యాయం చెప్పారు. అదేంటి అంటే పరిషత్ ఎన్నికలను బహిష్కరించాలని చంద్రబాబు పిలుపు ఇవ్వడం కరెక్టేనని ఆయన అంటున్నారు.
పంచాయతీ ఎన్నికలు సజావుగా సాగలేదని, అందుకే పరిషత్ ఎన్నికలకు దూరంగా ఉండాలని తమ అధినేత పిలుపు ఇచ్చాడని అంటున్నారు. అంతే తప్ప ఓటమి భయంతో తాము పరిషత్ ఎన్నికలను బహిష్కరించడంలేదని కూడా రామ్మోహనాయుడు చెప్పుకొచ్చారు.
అదే సమయంలో కొంతమంది తమ్ముళ్ళు చంద్రబాబు మాట పెడచెవిన పెట్టి పరిషత్ ఎన్నికల్లో పోటీకి రెడీ కావడంలో కూడా న్యాయముంది అంటున్నారు ఆయన.
మొత్తానికి రామ్మోహననాయుడు తేల్చింది ఏంటి అంటే రెండు వైపులా న్యాయం ఉందని, అన్యాయమంతా ప్రభుత్వానిదేనని. సో పరిషత్ పదనిసలు టీడీపీలో మరెన్ని సరిగమలు నాయకుల చేత పలికిస్తాయో చూడాల్సిందే.