ఇవాంక ట్రంప్ ఫిదా…వీడియోల్లో ఆయ‌న్ను చూసి!

అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ కుమార్తె ఇవాంక ట్రంప్ ఫిదా అయ్యారు. ఒక వైపు త‌మ దేశాన్ని క‌రోనా ఊపిరి తీస్తున్నా…ఓ నేత యోగాసానాల‌కు ఆమె ఉబ్బిత‌బ్బిబ్బ‌య్యారు. ఇంత‌కూ ఇవాంక‌ను అంత‌గా ప్ర‌భావితం చేసిన ఆ…

అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ కుమార్తె ఇవాంక ట్రంప్ ఫిదా అయ్యారు. ఒక వైపు త‌మ దేశాన్ని క‌రోనా ఊపిరి తీస్తున్నా…ఓ నేత యోగాసానాల‌కు ఆమె ఉబ్బిత‌బ్బిబ్బ‌య్యారు. ఇంత‌కూ ఇవాంక‌ను అంత‌గా ప్ర‌భావితం చేసిన ఆ నాయ‌కుడెవ‌రు? ఏమా క‌థ అని ఆలోచిస్తున్నారా? అయితే ఆలస్యం ఎందుకు? ఈ క‌థ‌నం చ‌ద‌వండి.

క‌రోనాను క‌ట్ట‌డి చేసేందుకు ప్ర‌ధాని మోడీ దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ ప్ర‌క‌టించాడు. దీంతో ఇళ్ల‌లో నుంచి బ‌య‌ట‌కు వెళ్లేందుకు వీల్లేకుండా ఉంది. ఈ ఖాళీ స‌మ‌యాన్ని ఆరోగ్య ర‌క్ష‌ణ‌కు ఎలా సద్వినియోగం చేసుకోవాలో ప్ర‌ధాని మోడీ సోష‌ల్ మీడియా వేదిక‌గా మార్గ‌నిర్దేశ‌నం చేశారు.

మోడీకి యోగా అంటే ఆరో ప్రాణం అని తెలుసు క‌దా! యోగాపై నెటిజ‌న్ల‌లో చైత‌న్యం తీసుకురావాల‌ని భావించారు. యోగాతో ఫిట్‌నెస్ పెంచుకోవ‌చ్చ‌ని, అలాగే మాన‌సిక ప్ర‌శాంత‌త కూడా పొంద‌వ‌చ్చ‌ని ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు.
అంతేకాదు, తాజాగా యోగ  నిద్రకు సంబంధించిన వీడియోను ప్ర‌ధాని పోస్ట్‌ చేశారు.

‘‘సమయం దొరికినపుడు… వారానికి ఒకటి లేదా రెండుసార్లు యోగ నిద్ర ప్రాక్టీసు చేస్తాను. తద్వారా మానసిక ఉల్లాసం కలుగుతుంది. ఒత్తిడి తగ్గుతుంది. ఇంటర్‌నెట్‌లో మరిన్ని యోగ నిద్ర వీడియోలు మీకు లభిస్తాయి. ఇంగ్లీష్‌, హిందీ భాషల్లో ఉన్న వీడియోను షేర్‌ చేస్తున్నాను’’ అని ఆయన ట్వీట్‌ చేశారు.

ప్ర‌ధాని వీడియోల‌కు నెటిజ‌న్ల నుంచి పెద్ద ఎత్తున స్పంద‌న వ‌స్తోంది. మోడీ వీడియోల‌పై అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంక ట్రంప్ భాగా ఫీల్ అయ్యారు. దీంతో ఆమె త‌న మ‌న‌సులో క‌లిగిన భావాల‌ను ఏ మాత్రం దాచుకోలేదు.

ఇది ఎంతో అద్భుతం, ధ‌న్య‌వాదాలు అని ఆమె ప్ర‌ధాని వీడియోల‌పై ట్వీట్ చేసి త‌న అభిప్రాయాల‌ను ప్ర‌ధానికి తెలియ‌జేశారు. ఒక వైపు త‌న దేశాన్ని కరోనా క‌మ్ముకుని క‌కావిక‌లం చేస్తున్నా…ఎంతో తీరిక చేసుకుని ప్ర‌ధాని యోగాసానాల‌పై  ఇవాంక స్పందించ‌డం నెటిజ‌న్ల ప్ర‌శంస‌లు అందుకుంటోంది.

వాళ్ళు పుట్టాక ఎప్పుడు ఇన్ని రోజులు వదిలి లేను