జగన్‌ది అరాచకమైతే.. చంద్రబాబు చేసిందేంటి.?

వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి ఆంధ్రప్రదేశ్‌లో అరాచక పాలన చేస్తున్నారంటూ తెలుగుదేశం పార్టీ నేతలు గగ్గోలు పెడుతున్నారు. 'ఛలో ఆత్మకూరు' పేరుతో తెలుగుదేశం పార్టీ చేస్తున్న యాగీ అంతా ఇంతా కాదు. వైసీపీ బాధితులంటూ గుంటూరులో…

వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి ఆంధ్రప్రదేశ్‌లో అరాచక పాలన చేస్తున్నారంటూ తెలుగుదేశం పార్టీ నేతలు గగ్గోలు పెడుతున్నారు. 'ఛలో ఆత్మకూరు' పేరుతో తెలుగుదేశం పార్టీ చేస్తున్న యాగీ అంతా ఇంతా కాదు. వైసీపీ బాధితులంటూ గుంటూరులో ఇటీవల ఓ పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేసి.. దాంతో చంద్రబాబు చేస్తున్న పబ్లిసిటీ స్టంట్స్‌ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. చంద్రబాబు 'అతి' సంగతి పక్కనపెడితే, ఆత్మకూరులో పరిస్థితిని చక్కదిద్దేందుకు వైఎస్‌ జగన్‌ సర్కార్‌ చర్యలు చేపట్టింది. 'వ్యక్తిగత కక్షలు, పార్టీల మధ్య గొడవలుగా మారాయి..' అన్నది వైసీపీ వెర్షన్‌. ఇరువర్గాల మధ్యా దాడులు జరిగాయనీ, అయితే, ఇప్పుడు పరిస్థితి ప్రశాంతంగా వుందని వైసీపీ చెబుతోంది.

పరిస్థితతి అదుపులోకి వస్తుండడం చంద్రబాబు జీర్ణించుకోలేకపోతున్నారేమో, 'ఛలో ఆత్మకూరు' అంటూ కొత్త వివాదానికి తెరలేపారు. రాష్ట్రంలోని టీడీపీ శ్రేణులు, ఈ ప్రోగ్రామ్‌ మీద స్పెషల్‌ ఫోకస్‌ పెట్టాయి. దీన్ని, రాష్ట్రస్థాయి సమస్యగా మార్చి.. వీలైతే జాతీయ స్థాయికీ వివాదాన్ని తీసుకెళ్ళాలన్న చంద్రబాబు ప్లాన్‌, పోలీసుల అలర్ట్‌ కారణంగా బెడిసికొట్టినట్లే భావించాలేమో. చంద్రబాబు సహా టీడీపీ నేతల హౌస్‌ అరెస్ట్‌ కొనసాగుతోంది. చంద్రబాబు మాత్రం, 'ఛలో ఆత్మకూర్‌' సక్సెస్‌ చేసి తీరతానంటున్నారు.

ఇంతకీ, చంద్రబాబు చెబుతున్నట్లు వైఎస్‌ జగన్‌ హయాంలో అరాచక పాలనే కొనసాగుతోందా.? అంటే, ఆ సంగతి తర్వాత.. ముందు చంద్రబాబు పాలన సంగతేంటి.? అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ప్రత్యేకహోదా కోసం వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి అప్పట్లో ప్రతిపక్ష నేత హోదాలో ఉద్యమాలు చేస్తే, ఉక్కుపాదంతో అణచివేసిందెవరు.? మిత్రపక్షం బీజేపీతో తెగతెంపులు జరగ్గానే, బీజేపీ నేతలపై దాడులు చేసిన అప్పటి అధికార పార్టీ టీడీపీ శ్రేణుల మాటేమిటి.!

విశాఖ విమానాశ్రయంలో వైఎస్‌ జగన్‌ని అడ్డగించడం అరాచకం కాక మరేమిటి.? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయిప్పుడు. తాను చేస్తేనే రాజకీయం.. ఇంకెవరైనా చేస్తే.. ఇంకోటేదో అన్నట్టుంది చంద్రబాబు వ్యవహారం. 'పోలీసుల మీద దాడులు చేస్తారా.? శాంతి భద్రతల్ని పరిరక్షిస్తున్న పోలీసుల విధులకు ఆటంకాలు కలిగిస్తారా?' అంటూ అప్పుడే ఇదే చంద్రబాబు, ప్రతిపక్షం మీద విరుచుకుపడిపోయారు. మరి, ఇప్పుడు పోలీసులు ముందస్తుగానే హెచ్చరించినప్పుడు చంద్రబాబు అండ్‌ టీమ్‌, ఎందుకు పోలీసుల విధులకు అడ్డు తగులుతున్నట్లు.? ఆయనంతే, మారడంతే.!

మొత్తమ్మీద, ''ఇదీ అసలు సిసలు అరాచకం అంటే.! అధికారంలో వున్నప్పుడూ అరాచకమే, ప్రతిపక్షంలో వున్నప్పుడూ అరాచకమే. ఇదే చంద్రబాబు రాజకీయం'' అంటున్న వైసీపీ నేతల వ్యాఖ్యల్ని ఎలా కొట్టిపారేయగలం.?  

ఎంత పని చేసావయ్యా సుజీత్‌!