వైసిపి ఎమ్.పిపై జగన్ సీరియస్

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పార్టీకి సంబంధించిన కీలక నేతలతో సమావేశం నిర్వహించారు. Advertisement ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియంకు వ్యతిరేకంగా నరసాపురం ఎమ్.పి రఘురామకృష్ణం రాజు చేసిన వ్యాఖ్యలపై…

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పార్టీకి సంబంధించిన కీలక నేతలతో సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియంకు వ్యతిరేకంగా నరసాపురం ఎమ్.పి రఘురామకృష్ణం రాజు చేసిన వ్యాఖ్యలపై క్లాస్‌ తీసుకోవాల్సిందిగా ఉభయ గోదావరి జిల్లాల పార్టీ ఇన్‌చార్జీ వై.వి. సుబ్బారెడ్డిని ఆదేశించారు. 

అయితే తాను తెలుగు భాష అభివృద్ది గురించి మాట్లాడానని, తాను ఎక్కడా ఇంగ్లీష్ మీడియంకు వ్యతిరేకంగా మాట్లాడలేదని ఆయన అంటున్నారు.

పార్లమెంటులో తాను మాట్లాడిన ప్రసంగం వీడియో చూడవచ్చని ఎక్కడా ప్రభుత్వ విదానాన్ని వ్యతిరేకించలేదని ఆయన అన్నారు. అయితే రఘురామకృస్ణంరాజు గతంలో కోడెలకు సంబందించి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి.

తాజాగా తెలుగు విషయంలో కొంత అసష్పష్టంగా మాట్లాడారని ముఖ్యమంత్రి జగన్ దృష్టికి వెళ్లింది. దానిపై ఆయన సీరియస్ అయి ఇన్ చార్జీ వైవి సుబ్బారెడ్డి తో మా్ట్లాడారు.

ఇంగ్లీష్ మీడియం కు వ్యతిరేకంగా పార్టీలో ఎవరు మాట్లాడినా క్రమశిక్షణ చర్యలు ఉంటాయని జగన్‌ స్పష్టం చేశారు.