ఉక్కు చిక్కుల్లో జనసేన?

విశాఖ ఉక్కు అంధ్రుల హక్కు అని అర్ధ శతాబ్దం క్రితం ఎలుగెత్తి నినదించి సాధించుకున్నారు. ఇపుడు కేంద్రం సంస్కరణల పేరిట విశాఖ ఉక్కుని నిర్వీర్యం చేయాలని చూస్తోందని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. Advertisement విశాఖ …

విశాఖ ఉక్కు అంధ్రుల హక్కు అని అర్ధ శతాబ్దం క్రితం ఎలుగెత్తి నినదించి సాధించుకున్నారు. ఇపుడు కేంద్రం సంస్కరణల పేరిట విశాఖ ఉక్కుని నిర్వీర్యం చేయాలని చూస్తోందని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి.

విశాఖ  ఉక్కులో పెద్ద ఎత్తున ఉన్న భూములను విదేశీ కంపెనీ పోస్కోకు అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. మరో వైపు ఏళ్ళ తరబడి పనిచేస్తున్న కార్మికులను వీయారెస్ పేరుతో ఇంటికి పంపించాలని కూడా చూస్తున్నారు.

దీంతో కార్మికలోకం రగులుతోంది. బీజేపీ విధానాల మీద కూడా మండిపడుతోంది. ఈ నేపధ్యంలో బీజేపీ మిత్ర పక్షంగా ఉన్న జనసేనకు ఒక్క సారిగా ఉక్కు కష్టాలు వచ్చిపడ్డాయి.

పొత్తు పేరిట రాజకీయ లాభాన్ని ఎంతవరకూ పొందిందో తెలియదు కానీ బీజేపీ చేసే తప్పులకు మాత్రం జనసేన బలి అవుతోంది అంటున్నారు.

బీజేపీ పెద్దలతో చెప్పి విశాఖ ఉక్కుని ప్రైవేటు కాకుండా చూడాలని కార్మిక సంఘాలు జనసేన నేతలకు వినతిపత్రాలు సమర్పిస్తున్నారు. 

మరి ఈ విషయంలో బీజేపీకు జనసేన చెప్పే స్థితిలో ఉందా. చెబితే వింటారా. విశాఖ అంటే తనకు చాలా ఇష్టం అంటున్న పవన్ మోడీ సర్కార్ తో విశాఖ ఉక్కు గురించి మాట్లాడగలరా. 

ఇవన్నీ ప్రశ్నలే. మొత్తానికి మోడీ ఇమేజ్ తో ఏపీలో బలపడాలని జనసేన చూస్తూంటే అటు పోలవరం, ఇటు విశాఖ స్టీల్ ప్లాంట్ విషయాల్లో కేంద్రం మెరిపిస్తున్న మెరుపులు మిత్ర పక్షం జనసేనకు షాకులు ఇచ్చేలా ఉన్నాయని  అంటున్నారు.

ఈ పలుకులకు పరమార్థం లేదు, ప్రయోజనం లేదు