తమిళనాట నుంచి హిందీ వ్యతిరేక స్వరాలు గట్టిగానే వినిపిస్తున్నాయి. ఇటీవల హిందీ దివస్ సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై దుమారం కొనసాగుతూ ఉంది. అమిత్ షా వ్యాఖ్యల నేపథ్యంలో బీజేపీ దక్షిణాది నేతలు, బీజేపీ దక్షిణాది మిత్రులు కూడా ఘాటుగా స్పందించారు. తమ తమ రాష్ట్రాల్లో హిందీని బలవంతంగా రుద్ధడాన్ని వారు వ్యతిరేకిస్తున్నట్టుగా మాట్లాడారు.
అదలా ఉంటే.. నటుడు, రాజకీయ నేత కమల్ హాసన్ మరో ఆసక్తిదాయకమైన కామెంట్ చేశాడు. హిందీ చరిత్రను కమల్ ప్రశ్నించారు. దేశంలో ప్రాచీన భాషలంటే తమిళం, తెలుగు, సంస్కృతం అని కమల్ వ్యాఖ్యానించడం గమనార్హం. ఆ భాషల ముందు హిందీ ఒక బచ్చా అని కమల్ అన్నారు.
తమిళ, తెలుగు, సంస్కృతంలు.. హిందీకన్నా పురాతనమైనవన్నట్టుగా కమల్ వ్యాఖ్యానించారు. అలా హిందీ వ్యతిరేకతను వ్యక్తంచేశారు కమల్. యువత రాజకీయాలను అసహ్యించుకోవద్దని, రాజకీయాల్లోకి వచ్చి వాటిని సంస్కరించాల్సిన బాధ్యత యువత మీదే ఉందని కమల్ హితోపదేశం చేశారు.