విశాఖ గురించి మంత్రి కీలక కామెంట్స్ ?

విశాఖ రాష్ట్రంలోనే ఎంతో ముఖ్యమైన నగరం అని మంత్రి కన్నబాబు పేర్కొన్నారు. విశాఖ అభివృద్ధికి తమ ప్రభుత్వం పూర్తి స్థాయిలో కట్టుబడి ఉందని ఆయన గట్టిగా చెప్పారు. విశాఖలో తాజాగా జరిగిన అభివృద్ధి మండలి…

విశాఖ రాష్ట్రంలోనే ఎంతో ముఖ్యమైన నగరం అని మంత్రి కన్నబాబు పేర్కొన్నారు. విశాఖ అభివృద్ధికి తమ ప్రభుత్వం పూర్తి స్థాయిలో కట్టుబడి ఉందని ఆయన గట్టిగా చెప్పారు. విశాఖలో తాజాగా జరిగిన అభివృద్ధి మండలి సమావేశంలో ఆయన ఈ మేరకు కీలకమైన కామెంట్స్ చేశారు.

విశాఖ సర్వతోముఖాభివృద్ధికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి కంకణం కట్టుకున్నారని ఆయన అన్నారు. విశాఖలో ఎన్నో ప్రగతి పనులకు ఈ మధ్యనే జగన్ శ్రీకారం చుట్టారని, చాలా పధకాలు పైప్ లైన్ లో ఉన్నాయని కన్నబాబు చెప్పారు.

విశాఖను నంబర్ వన్ సిటీగా నిలబెట్టడానికి ప్రభుత్వం పెద్ద ఎత్తున దృష్టి సారింది అనేక ప్రతిపాదనలు కూడా సిద్ధం చేసిందని కన్నబాబు చెప్పారు. విశాఖ తమ టాప్ ప్రయారిటీ అన్నది ఆయన ఈ మీటింగ్ ద్వారా మరోసారి నొక్కి చెప్పారు.

విశాఖ కార్పోరేషన్ ద్వారా చేపట్టనున్న అభివృద్ధి కార్యక్రమాలు కానీ, వీఎమ్మార్డీయే ద్వారా కానీ రూపొందించిన కార్యక్రమాలు కానీ పూర్తి స్థాయిలో సమీక్షించుకుని రానున్న రోజుల్లో అన్నీ మెటీరియలైజ్ అయ్యేలా చూస్తామని కన్నబాబు హామీ ఇచ్చారు.

అయితే విశాఖ పాలనారాజధాని  విషయం అయితే ఆయన ఎక్కడా చెప్పలేదు కానీ విశాఖ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని చెప్పడమే ఇక్కడ విశేషం. మొత్తానికి విశాఖ జిల్లా ఇంచార్జి మంత్రిగా కన్నబాబు విశాఖకే తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని చెప్పడం మీద రాజకీయంగా ఆసక్తికరమైన చర్చ సాగుతోంది.

అభివృద్ధి చేస్తామని మంత్రి చెబుతున్నా విశాఖ రాజధాని గురించి ప్రస్థావించకపోవడం పట్ల ఆయా వర్గాల్లో కొంత నిరాశ కనిపిస్తోంది. అయితే విశాఖ టాప్ ప్రయారిటీ అని కన్నబాబు చెప్పడం పట్ల మాత్రం హర్షం వ్యక్తం అవుతోంది. చూడాలి మరి కొత్త ఏడాది విశాఖను ఏ స్థాయిలో తీసుకెళ్తాయో. జగన్ సర్కార్ ఆలోచనలు ఎలా సాగుతాయో.