కేసీఆర్ కేబినెట్.. అంతా ఓకే?

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కేబినెట్ కు సంబంధించి లొల్లి అంతా ముగిసినట్టేనా.. అనే అంశంపై చర్చ సాగుతూ ఉందిప్పుడు. ఇన్ని రోజులూ కేసీఆర్ కేబినెట్లో హరీష్ రావుకు చోటు దక్కుతుందా, కేటీఆర్ ఎప్పుడు కేబినెట్లోకి…

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కేబినెట్ కు సంబంధించి లొల్లి అంతా ముగిసినట్టేనా.. అనే అంశంపై చర్చ సాగుతూ ఉందిప్పుడు. ఇన్ని రోజులూ కేసీఆర్ కేబినెట్లో హరీష్ రావుకు చోటు దక్కుతుందా, కేటీఆర్ ఎప్పుడు కేబినెట్లోకి ఎంట్రీ ఇస్తారనే అంశాలపై చర్చ సాగుతూ వచ్చింది. తెలంగాణ రాష్ట్ర సమితి వర్గాల్లోనూ, పరిశీలకుల్లో కూడా ఈ అంశం మీద చర్చ జరుగుతూ వచ్చింది. ఈ నేపథ్యంలో ఎట్టకేలకూ ఆ వ్యవహారంపై కేసీఆర్ తేల్చేశారు.

హరీష్ కు దక్కుతుందా లేదా.. అనుకున్న కేబినెట్ బెర్త్ దక్కనే దక్కింది. కేటీఆర్ కు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవితో పాటు మంత్రిపదవి, తన పాతశాఖ కూడా దక్కింది. అలాగే హరీష్ రావుకు కీలకంగా భావించే ఆర్థికశాఖను అప్పగించారు. ఈ నేపథ్యంలో హరీష్ కు ప్రాధాన్యత దక్కినట్టే! అలాగే ప్రమాణ స్వీకారోత్సవానికి హరీష్, కేటీఆర్ లు ఒకే కారులో వచ్చారట. తద్వారా తమ మధ్యన విబేధాలు లేవని వారు స్పష్టత ఇచ్చే ప్రయత్నం ఇంకోసారి చేసినట్టు అయ్యిందని మీడియా వర్గాలు అంటున్నాయి.

ఇక లోటు అనుకున్న మహిళా మంత్రులు కూడా కేసీఆర్ కేబినెట్లో చోటు సంపాదించారు. ఇన్నాళ్లూ చామకూర మల్లారెడ్డి చేతిలో ఉండిన స్త్రీశిశు సంక్షేమశాఖ ఎట్టకేలకూ ఒక మహిళకు దక్కింది. అయితే ఈసారి విస్తరణలో కూడా చోటు దక్కలేదని కొంతమంది బాదపడుతూ ఉన్నారట.

కాంగ్రెస్ హయాంలో ఉమ్మడి రాష్ట్రానికే మంత్రులుగా చేసిన వాళ్లు కొందరు ఇప్పుడు కేసీఆర్ కేబినెట్లో చోటు దక్కలేదని బాధపడుతూ ఉన్నారట. ఎమ్మెల్యేలు అందరినీ మంత్రివర్గంలోకి తీసుకున్నా.. అసంతృప్తులు ఉండనే ఉంటారు. ప్రస్తుతానికి అయితే హరీష్ తిరుగుబాటు ఊహాగానాలకు తెరపడినట్టే. అలాగని కేటీఆర్ కు ప్రాధాన్యత తగ్గలేదు. బాగానే బ్యాలెన్స్ చేసుకుంటున్నట్టుగా ఉన్నారు తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత.

జగన్‌ పాలన.. 'హాఫ్‌' మార్కును చేరిన అభినందనలు