జగన్ ట్రాప్ లో కేసీఆర్ పడాల్సిన సమయమొచ్చింది!

మొన్నటి వరకూ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలనను ఎద్దేవా చేయడానికి తెలుగుదేశం పార్టీ వాళ్లు కేసీఆర్ ను ఉపయోగించుకున్నారు. కేసీఆర్ తో జగన్ వివిధ అంశాల గురించి చర్చించడానికి సమావేశం కాగా.. టీడీపీ…

మొన్నటి వరకూ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలనను ఎద్దేవా చేయడానికి తెలుగుదేశం పార్టీ వాళ్లు కేసీఆర్ ను ఉపయోగించుకున్నారు. కేసీఆర్ తో జగన్ వివిధ అంశాల గురించి చర్చించడానికి సమావేశం కాగా.. టీడీపీ దాన్నిఅస్త్రంగా మార్చుకోవాలని చూసింది. జగన్ కు అనుభవం లేదని, అందుకే కేసీఆర్ తో సమావేశం అవుతున్నారంటూ తెలుగుదేశం పార్టీ ఇష్టానుసారం మాట్లాడింది. అయితే తను అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు కేసీఆర్ తో మిత్రుత్వానికి చాలా ట్రై చేశారు!

టీఆర్ఎస్ తో పొత్తుకోసం తను ప్రయత్నించినట్టుగా బహిరంగంగానే ఒప్పుకున్నారు చంద్రబాబు నాయుడు. అయితే చంద్రబాబును కేసీఆర్ ఈసడించుకుని దూరంపెట్టారు. ఇప్పుడు జగన్ తో కేసీఆర్ సఖ్యతగా మెలుగుతున్నారు. ఇది తెలుగుదేశం పార్టీకి మింగుడుపడటం లేదు. దీంతో ఈ అంశాన్ని రాజకీయంగా వాడుకునేందుకు ప్రయత్నాలు సాగించింది. అయితే టీడీపీకి ఇప్పుడు ఆ అవకాశం కూడా దక్కేలాలేదు. కేసీఆర్ పై ఇప్పుడు జగన్ వైపు నుంచి ఒత్తిడి పెరుగుతోంది.

జగన్ పాలన తీరుతో కేసీఆర్ ఇబ్బందులుపడుతూ ఉన్నారు. తెలంగాణ వాళ్లే కేసీఆర్ వద్దు, జగన్ ముద్దు అనే పరిస్థితి వచ్చింది. ఆర్టీసీ విలీనం అయితేనేం, కౌలు రైతులకు కూడా పెట్టుబడి సాయం అయితేనేం.. అన్నింటికీ మించి లక్షకు పైగా ఉద్యోగాలను కల్పించడం అయితేనేం! ఇవన్నీ కూడా ప్రజలను బాగా ఆకట్టుకుంటున్న అంశాలు. తెలంగాణలో ఆర్టీసీ గొడవను తెగేదాకా లాగుతున్నారు కేసీఆర్. ఇక కౌలు రైతులకు పెట్టుబడి సాయం ఊసులేదు. అన్నింటికీ మించి తెలంగాణ వస్తే ఉద్యోగాలన్న కేసీఆర్ నామమాత్రంగా కూడా  వాటిని భర్తీ చేయలేదు.

మిగులు బడ్జెట్ ఉన్న తెలంగాణ రాష్ట్రంలో పాలనకూ, లోటు బడ్జెట్ తో మూడులక్షల కోట్లకు పైగా అప్పులున్న ఏపీకి ఏమాత్రం పొంతనలేని పాలన నడుస్తూ ఉంది. ఇలాంటి నేపథ్యంలో ఇక నుంచి జగన్ ను  కలవాలంటే కూడా కేసీఆర్ భయపడే పరిస్థితి వచ్చింది. పోలిక వస్తూ ఉండటంతో.. ఆయన ఇబ్బంది పడుతూ ఉన్నారు. తప్పనిసరిగా అయినా జగన్ చేసిన పనులను కేసీఆర్ అమలు చేసే సమయం వచ్చినట్టుగా ఉంది.

దీంతో ఇప్పుడు కేసీఆర్ ను బూచిగా చూపించి జగన్ పై వ్యతిరేకత పెంచే అవకాశమూ తెలుగుదేశం పార్టీకి లేకపోతూ ఉంది! తెలంగాణ ప్రజలే జగన్ ను కోరుకోవడం అంటే.. ఏపీలో తెలుగుదేశం పార్టీ అస్త్ర సన్యాసం దిశగా సాగడమే!

అప్పుడు బ్లాక్ మెయిలర్.. ఇప్పుడు చీటర్.. రవి ప్రకాష్!