తను పార్టీ మారడం మాత్రం ఖాయమని ప్రకటించారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఈ విషయంలో ఇప్పటికే భారతీయ జనతా పార్టీ నేతలతో సంప్రదింపులు చేపట్టినట్టుగా కూడా ఆయన వివరించారు. బీజేపీ అగ్రనేత రాంమాధవ్ తో సంప్రదింపులు జరిపినట్టుగా, కిషన్ రెడ్డి తదితరులతో కూడా టచ్లో ఉన్నట్టుగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పష్టంచేశారు.
అయితే పార్టీ మారడం విషయంలో చట్టపరమైన అడ్డంకులు ఏమున్నాయనే అంశం గురించి ఆలోచన చేస్తూ ఉన్నట్టుగా ఆయన తెలిపారు. అవసరం అనుకుంటే ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేయడానికి రెడీ అని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రకటించారు.
కాంగ్రెస్ పార్టీకి దేశంలో భవితవ్యం లేదని రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీనే అధ్యక్ష పీఠం వద్దంటూ తప్పుకుంటున్నారని, అలాంటి పార్టీకి భవిష్యత్ ఏముందని ఆయన అన్నారు. తెలంగాణలో టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం బీజేపీనే అని కోమటిరెడ్డి తేల్చారు. కాంగ్రెస్ కు రాజీనామా చేయడం ఖాయమని అని రాజగోపాల్ రెడ్డి స్పష్టత ఇచ్చేశారు. ఈయన విషయంలో టీపీసీసీ ఎలా స్పందిస్తుందో!