లాండ్ ఆడిట్ తో విశాఖ భూ దందాకు చెక్

విశాఖ అనగానే అందరికీ ఒక మోజు. ఈ నగరం ఎపుడు రాజధాని రాజసంతో వెలిగిపోతూనే ఉంటుంది. ఇపుడు వైసీపీ సర్కార్ రాజధాని అని ప్రకటించింది. దాంతో భూముల విలువ ఒక్కసారిగా రెట్టింపు అయింది. దందారాయుళ్ళు…

విశాఖ అనగానే అందరికీ ఒక మోజు. ఈ నగరం ఎపుడు రాజధాని రాజసంతో వెలిగిపోతూనే ఉంటుంది. ఇపుడు వైసీపీ సర్కార్ రాజధాని అని ప్రకటించింది. దాంతో భూముల విలువ ఒక్కసారిగా రెట్టింపు అయింది. దందారాయుళ్ళు పండుగ చేసుకోవడానికి రెడీ అయిపోయారు.

అయితే ఇలాంటి భూకబ్జాదారుల ఆటలు సాగవని మంత్రి కురసాల కన్నబాబు అంటున్నారు. విశాఖలో దాదాపు అయిదువేల ఎకరాల భూమి వివాదంలో ఉందని, న్యాయపరమైన అవరోధాల ముసుగులో వేల ఎకరాల భూములను కబ్జా చేయాలని చూస్తున్నారని మంత్రి అంటున్నారు.

అటువంటి భూములను గుర్తించి ప్రభుత్వపరం అయ్యేలా కఠినమైన చర్యలు తీసుకుంటున్నామని మంత్రి చెప్పారు. ఎంతటి పెద్దవారు అయినా భూదందా చేస్తే సహించబోమని మంత్రి హెచ్చరించారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి జగన్ కచ్చితంగా ఉంటున్నారని ఆయన అన్నారు.

గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో భూములను పెద్ద ఎత్తున కబ్జా చేశారని కూడా మంత్రి ఆరోపించారు. ఇపుడు అటువంటి పరిస్థితి రాకుండా చూడడమే తమ ప్రభుత్వ కర్తవ్యం అని ఆయన చెప్పారు. అక్రమార్కులు కబ్జాలు చేయకుండా  వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి క్రుషిచేస్తూంటే ఆయన మీద ఎదురుదాడికి దిగుతున్నారని మంత్రి కన్నబాబు అంటున్నారు.

ఇక విశాఖ భూముల విషయంలో లాండ్ ఆడిట్ నిర్వహిస్తామని, గతంలో వివిధ ప్రాజెక్టుల కోసం భూములు తీసుకున్న వారు వాటిని కనుక పూర్తి చేయకపోతే వెనక్కుతీసుకుంటామని కూడా మంత్రి చెప్పారు. మొత్తానికి చూసుకుంటే మంత్రి చెప్పిన మాటలతో భూదందారాయుళ్ళకు భారీ షాక్ తగిలినట్లే మరి.

నిమ్మగడ్డ వ్యవహారంపై పూర్తి దర్యాప్తు

పార్టీని ఏనాడూ పల్లెత్తు మాట కూడా అనలేదు