మాస్క్ వేసుకుని బీప్ లేకుండా మాట్లాడితే ఎలా!

“రేపట్నుంచి ఫేస్ బుక్ లో పోస్ట్ పెట్టాలంటే జగన్ రెడ్డి పర్మిషన్ కావాలేమో.. మొగుడు సొంత పెళ్లానికి వాట్సప్ మెసేజ్ పెట్టాలంటే.. జగన్ రెడ్డికి ఫోన్ చేయాలేమో..” ఇలా సాగాయి నిమ్మాడలో నారా వారి…

“రేపట్నుంచి ఫేస్ బుక్ లో పోస్ట్ పెట్టాలంటే జగన్ రెడ్డి పర్మిషన్ కావాలేమో.. మొగుడు సొంత పెళ్లానికి వాట్సప్ మెసేజ్ పెట్టాలంటే.. జగన్ రెడ్డికి ఫోన్ చేయాలేమో..” ఇలా సాగాయి నిమ్మాడలో నారా వారి వ్యంగ్య బాణాలు. అచ్చెన్న కుటుంబాన్ని పరామర్శించేందుకు వచ్చి.. సోషల్ మీడియా అరెస్టులపై కాస్త అతిగా స్పందించారాయన. వృద్ధులను సైతం వదలడంలేదని తెగ బాధపడ్డారు.

తప్పు చేస్తే ముసలోడైనా, కుర్రోడైనా ఒకటే. ముసలోళ్లయితే కృష్ణారామా అనుకోక, సోషల్ మీడియాలో ఓవర్ యాక్షన్ దేనికి? ముసలోళ్లను అరెస్ట్ చేశారంటూ కుర్రోడిలా ఫీలయ్యే లోకేష్ శోకండాలు పెట్టడం దేనికి? అయితే లోకేష్ చేసిన వెటకారం సోషల్ మీడియాలో బాగా రివర్స్ అయింది. లోకేష్ భార్య బ్రాహ్మణిని కూడా సీన్ లోకి తీసుకొచ్చేశారు నెటిజన్లు.

ఇంతకీ జగన్ రెడ్డి పర్మిషన్ తో లోకేష్ తన భార్యకు ఏం మెసేజ్ పెట్టారంటూ కాస్త ఘాటుగానే ప్రశ్నించారు. మాస్క్ వేసుకున్నంత మాత్రాన ఏది మాట్లాడినా చెల్లుబాటవుతుందని అనుకుంటున్నారేమో.. నోరు జారితే తాటతీస్తామంటూ లోకేష్ ని హెచ్చరించాయి వైసీపీ శ్రేణులు.

మాస్క్ పెట్టుకుంటే హావభావాలు ఎవరికీ కనపడవు కాబట్టి ఏదైనా మాట్లాడొచ్చనే భ్రమలో లోకేష్ ఉన్నట్టున్నారు. నోటికొచ్చినట్టు మాట్లాడేస్తున్నారు. పైగా మాస్క్ వేసుకొని ఏ బూతు మాట్లాడినా బీప్ అయిపోతుందనే అజ్ఞానంలో ఉన్నట్టున్నారు. మధ్య మధ్యలో మాస్క్ సరిచేసుకుంటూ కాస్త అతిగానే ప్రవర్తిస్తున్నారు. మొన్న అనంతపురం పర్యటన అయినా, నిన్న శ్రీకాకుళం పర్యటనలో అయినా మాస్క్ పెట్టుకొని లోకేష్ చేసింది పూర్తిగా అతి మాత్రమే.

ఇలా మాస్క్ తగిలించుకుని కాస్త జంకుబెంకు వదిలించుకున్న లోకేష్.. అనుకోని అతి చేసి నెటిజన్లకు బుక్కయ్యారు. ఇంతకీ జగన్ రెడ్డి పర్మిషన్ తీసుకుని.. లోకేష్ ఎవరెవరికి ఏయే మెసేజ్ లు పెట్టారో చెబితే.. కాస్త జనాలు తెలుసుకుంటారు, ఆయన్నే ఫాలో అవుతారు.  

మళ్ళీ ఎన్నికల కమిషనర్ గా నిమ్మగడ్డ ?

నాయకుడంటే అర్థం తెలిసింది