లోకేశ్ ట్వీట్ అదుర్స్‌…ఆచ‌ర‌ణ‌లో మాత్రం తుస్

అదేంటో గానీ టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేశ్ యూత్ గురించి మాట్లాడితే…అదో బూతులా చూస్తున్నారు. ఎందు కిలా యువ‌రాన‌ర్‌?  గిట్ట‌ని వాళ్లు లోకేశ్ గురించి ఎన్నైనా సెటైర్లు, విమ‌ర్శ‌లు చేయొచ్చు. కానీ…

అదేంటో గానీ టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేశ్ యూత్ గురించి మాట్లాడితే…అదో బూతులా చూస్తున్నారు. ఎందు కిలా యువ‌రాన‌ర్‌?  గిట్ట‌ని వాళ్లు లోకేశ్ గురించి ఎన్నైనా సెటైర్లు, విమ‌ర్శ‌లు చేయొచ్చు. కానీ ఆయ‌న్ను ద‌గ్గ‌రిగా చూసిన వాళ్లు మాత్రం మెచ్చుకోలు మాట‌లే చెబుతారు. టీడీపీ యువ‌కిశోరం, చంద్ర‌బాబు త‌ర్వాత ముఖ్య‌మంత్రి రేస్‌లో ఎవ‌రనే ప్ర‌శ్న‌కు…లోకేశ్ పేరు త‌ప్ప మ‌రెవ‌రి పేరైనా వినిపిస్తుం దా? మ‌రే యువ నాయ‌కుడైనా క‌నిపిస్తాడా?

జూనియ‌ర్ ఎన్టీఆర్ పేరంటారా? ఆశ‌, దోసె, అప్ప‌డం కాదు! ఎంతో క‌ష్ట‌ప‌డి సీనియ‌ర్ ఎన్టీఆర్‌ను దించేసి, ఆయ‌న సీట్లో చంద్ర బాబు కూచున్న‌ది మ‌ళ్లీ ఆ నంద‌మూరి వాళ్ల చేతిలో టీడీపీని పెట్ట‌డానికా? అంత‌కంటే ఆత్మ‌హ‌త్యా సదృశ్యం ఏదైనా ఉంటుందా? జూనియ‌ర్ ఎన్టీఆర్‌లో ఉన్న‌ది, మ‌న లోకేశ్‌బాబులో లేనిది ఏంటో చెప్పండి చూద్దాం? అదే మ‌న లోకేశ్ బాబులో ఎన్ని సుగుణాలో…చెబితే చేంతాడంత‌, వింటే మ‌హాభార‌త‌మంత‌.

అంతెందుకు ఈ రోజే తీసుకుందాం. అంత‌ర్జాతీయ యువ‌జ‌న దినోత్స‌వ‌మ‌ని ఎంత‌మందికి తెలుసు?  151 సీట్ల‌తో అధికారంలోకి వ‌చ్చిన ముఖ్య‌మంత్రికేమైనా ఆ విష‌యం తెలుసా?  తెలిసి ఉంటే ఏదీ ట్వీటాడాడ‌? అదే మ‌న లోకేశ్‌ను తీసుకోండి…ఎంత చ‌క్క‌గా అంత‌ర్జాతీయ యువ‌జ‌న దినోత్స‌వాన్ని గుర్తు పెట్టుకుని ట్వీట్ చేశాడు తెలుసా?

అదేనండి యూత్ అంటే. లోకేశ్ యూత్ కాబ‌ట్టి…యువ‌కుల దినాన్ని గుర్తు పెట్టుకున్నాడు. ఈ సంద‌ర్భంగా మాజీ రాష్ట్ర‌ప‌తి అబ్దుల్‌క‌లాం స్ఫూర్తిదాయ‌క మాట‌ల‌ను ట్వీట్ చేసి యూత్‌ను ప్రోత్స‌హించాడు. ఇంత‌కూ లోకేశ్ ట్వీట్ ఏంటంటే…

“కష్టాలు నిన్ను నాశనం చేసేందుకు రాలేదు. నీ శక్తిసామర్ధ్యాలను బయటకు తీసి నువ్వెంటో నిరూపించుకునేందుకు వచ్చాయి. ఆ కష్టాలకు కూడా తెలియాలి నిన్ను సాధించడం కష్టమని” అంటూ కలాం చెప్పిన మాట‌లు యువతకి మార్గనిర్దేశ మని లోకేశ్ ట్వీట్ చేశారు.

అంతేకాదు, కాలం మారుతోందని, కొత్త సవాళ్లు ఎదురవుతున్నాయని ట్విట్టర్‌లో పేర్కొన్నారు. సవాళ్ళను స్వీకరించి, గెలు పున‌కు ముందడుగు వేయాల‌ని లోకేశ్ ట్వీట్ చేశారు.  ట్వీట్ వ‌ర‌కు అద్భుతంగా ఉంది. కానీ గ‌త సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో పార్టీతో పాటు తానూ స్వ‌యంగా ఓడిపోయిన లోకేశ్‌కు తాను జాతీయ కార్య‌ద‌ర్శిగా ఉన్న పార్టీ ఎంత క‌ష్టాల్లో ఉందో ఏమైనా తెలుస్తోందా?

ఒక వైపు టీడీపీని క‌బ‌ళించేందుకు బీజేపీ దూసుకొస్తుండ‌డం, మ‌రోవైపు అధికార పార్టీ వైసీపీ ధాటికి నాయ‌క‌త్వం దిక్కుతోచ‌ని స్థితిలో ఉంటే…లోకేశ్ మాత్రం సోష‌ల్ మీడియాకు ప‌రిమితం కావ‌డం ఎంత వ‌ర‌కు స‌మంజ‌సం. అబ్దుల్ క‌లాం స్ఫూర్తితో తానే క‌ద‌న‌రంగంలోకి ఎందుకు దిగ‌డం లేదు? స‌్ఫూర్తి, పోరాటం ఎదుటి వాళ్ల‌కేనా…త‌మ‌రికి వ‌ర్తించ‌వా లోకేశ్‌? 

ఒకసారి మోసపోయాను ఈ సారి వదలను

ఈ గడ్డంతో నిద్ర పట్టట్లేదు