ఎన్నికల సమయంలో పట్టుకున్న డబ్బు వెనక్కివాలట!

ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా తనిఖీలు జరుగుతున్న వేళ భారీ పోలీసులకు పట్టుబడిన డబ్బు గురించి ఒక మాజీ ఎంపీ పోరాటం మొదలుపెట్టారు. ఎన్నికల్లో ఓడిపోయిన ఆయన ఇప్పుడు తన తబ్బు తనకు ఇవ్వాలని…

ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా తనిఖీలు జరుగుతున్న వేళ భారీ పోలీసులకు పట్టుబడిన డబ్బు గురించి ఒక మాజీ ఎంపీ పోరాటం మొదలుపెట్టారు. ఎన్నికల్లో ఓడిపోయిన ఆయన ఇప్పుడు తన తబ్బు తనకు ఇవ్వాలని అంటున్నారు. తెలుగుదేశం పార్టీ మాజీ ఎంపీ మాగంటిబాబు ఈ మేరకు విజయవాడ పోలిస్ కమిషనర్ ను కోరారని తెలుస్తోంది.

ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా ఒక సిమెంట్ లారీలో అక్రమంగా తరలిస్తున్న డబ్బును విజయవాడ పోలీసులు పట్టుకున్నారు. సిమెంట్ లోడ్ లో సంచుల మధ్యన ఒక బాక్స్ లో డబ్బునుపెట్టి తరలించే ప్రయత్నం చేశారు. అయితే పోలీసులకు దొరికిపోయారు. అందులోని డబ్బు విలువ కోటీ తొంభైరెండు లక్షలు అని పోలీసులు తేల్చారు. ఆ డబ్బును తరలిస్తూ సిమెంట్ లారీలో ప్రయాణిస్తున్న వ్యక్తి అప్పుడే పరార్ అయ్యాడు.

ఇప్పుడు ఆ డబ్బును క్లైమ్ చేసుకుంటున్నాడు మాగంటి బాబు. ఆ డబ్బు తనదే అని ఈయన స్వయంగా వెళ్లి పోలీసులకు చెప్పారట. మరి ఒక ఎంపీ అయ్యుండి, అలా దొంగగా డబ్బును ఎందుకు తరలిస్తున్నట్టో ఈయన చెప్పలేదట. చేపలు అమ్మగా తనకు ఆ డబ్బు వచ్చిందని అంటున్నారట. తన సొమ్మును ప్రభుత్వం సీజ్ చేసిందని, ఇప్పుడు ఆ డబ్బులు  తనకు ఇవ్వాలని ఆయన కోరుతున్నారట.

ఆ డబ్బుకు సంబంధించి తనకు ఆదాయపన్ను శాఖ ఫైన్ కూడా వేసిందని, అరవై లక్షల రూపాయలకు పైగా తను పన్ను కూడా కట్టినట్టుగా మాగంటి బాబు చెబుతున్నారు. కాబట్టి ఆ డబ్బు తనకు ఇవ్వాలనేది ఆయన వాదన. అయితే  అప్పుడేమో అక్రమంగా డబ్బును తరలించే ప్రయత్నం చేశారు, అనుచరుడు కూడా  పారిపోయాడు. అది కూడా ఎన్నికల వేళ!

ఇప్పుడేమో ఆ డబ్బు తనదే అని తను ఐటీశాఖకు ఫైన్ కూడా కట్టినట్టుగా చెబుతున్నారు. మొత్తానికి ఎన్నికల వేళ పట్టుబడిన డబ్బు గురించి ఓడిన ఎంపీగారు ఇప్పుడు పోరాటం మొదలుపెట్టడం గమనార్హం!

ఏపీ రాజధానిని వైఎస్ జగన్ మారుస్తారా?