రామోజీపై వేలాడుతున్న ‘మార్గ‌ద‌ర్శి’ క‌త్తి

ఈనాడు, ఈటీవీ సంస్థ‌ల అధినేత రామోజీరావుపై ‘మార్గ‌ద‌ర్శి’ క‌త్తి వేలాడుతోంది. ఈ కేసులో ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వాన్ని కూడా ప్ర‌తివాదిగా చేర్చాల‌ని దేశ అత్యున్న‌త న్యాయ స్థానం సుప్రీంకోర్టు నిర్ణ‌యించింది. ఈ నిర్ణ‌యం రామోజీరావుకు ప్ర‌మాద…

ఈనాడు, ఈటీవీ సంస్థ‌ల అధినేత రామోజీరావుపై ‘మార్గ‌ద‌ర్శి’ క‌త్తి వేలాడుతోంది. ఈ కేసులో ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వాన్ని కూడా ప్ర‌తివాదిగా చేర్చాల‌ని దేశ అత్యున్న‌త న్యాయ స్థానం సుప్రీంకోర్టు నిర్ణ‌యించింది. ఈ నిర్ణ‌యం రామోజీరావుకు ప్ర‌మాద ఘంటిక‌లు మోగిస్తున్న‌ట్టే అని న్యాయ నిపుణులు చెబుతున్నారు. మార్గ‌ద‌ర్శి ఫైనాన్షియ‌ర్స్ చైర్మ‌న్ రామోజీరావును కేసు నుంచి డిశ్చార్జ్ చేయ‌డాన్ని స‌వాల్ చేస్తూ మాజీ ఎంపీ ఉండ‌వ‌ల్లి అరుణ్‌కుమార్ గ‌తంలో దాఖ‌లు చేసిన పిటిష‌న్‌పై శుక్ర‌వారం విచార‌ణ జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా కేసు వివ‌రాల‌ను ఉండ‌వ‌ల్లి , సీనియ‌ర్ అడ్వ‌కేట్ ఎస్ఎస్ ప్ర‌సాద్‌కుమార్ మీడియాకు వివ‌రించారు.

12 ఏళ్లుగా కోర్టు విచార‌ణ‌కే హాజ‌రు కాని పెద్ద మ‌నిషి రామోజీ గుట్టు చ‌ప్పుడు కాకుండా హైకోర్టులో కేసు నుంచి త‌ప్పించుకున్నాడ‌న్నారు. కానీ సుప్రీంకోర్టు నుంచి అత‌ను త‌ప్పించుకోలేక పోయాడ‌ని ఉండ‌వ‌ల్లి చెప్పారు. బాహ్య ప్ర‌పంచంలో ఎంత‌టి వారైనా కావ‌చ్చ‌ని, కానీ చ‌ట్టం ముందు మాత్రం అంద‌రూ స‌మానులే అన్నారు. ఏదో ఒక వంక‌తో స్టేలు తెచ్చుకుని కేసు నుంచి త‌ప్పించుకోవాల‌ని రామోజీరావు ప్ర‌య‌త్నిస్తున్నార‌ని వారు అన్నారు. అంతేకాకుండా కేసులో తెలంగాణ రాష్ట్రాన్ని మాత్ర‌మే ప్ర‌తివాదిగా చేర్చార‌ని, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ను కూడా చేయాల‌న్న త‌మ విజ్ఞ‌ప్తిని న్యాయ‌స్థానం స్వీక‌రించ‌డం ఆనందం క‌లిగిస్తోంద‌న్నారు. 

ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో మార్గ‌ద‌ర్శి ఫైనాన్షియ‌ర్స్ చైర్మ‌న్‌గా  రామోజీరావు సార‌థ్యం వ‌హిస్తున్న సంస్థ రూ.2300 కోట్లు వ‌సూలు చేసింద‌న్నారు. అయితే నాటి ముఖ్య‌మంత్రి వైఎస్సార్ త‌న‌పై వ్య‌క్తిగ‌తంగా క‌క్ష క‌ట్టార‌ని ఆరోపిస్తూ రామోజీరావు కోర్టును ఆశ్ర‌యించార‌న్నారు. రామోజీ పిటిష‌న్‌పై కోర్టు ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింద‌న్నారు. రాజ‌శేఖ‌ర్‌రెడ్డి పేరు వాడ‌టానికి వీల్లేద‌ని, రాష్ట్ర ముఖ్య‌మంత్రి అని పేర్కొనాల‌ని న్యాయ‌స్థానం సూచించిన‌ట్టు గుర్తు చేశారు. ఆ త‌ర్వాత కేసుపై న్యాయస్థానం స్టే ఇచ్చింద‌ని ఉండ‌వ‌ల్లి, ఆయ‌న లాయ‌ర్ పేర్కొన్నారు. 

అయితే హైకోర్టు ఇచ్చిన తీర్పుపై తాను సుప్రీంకోర్టులో స‌వాల్ చేసిన‌ట్టు ఉండ‌వ‌ల్లి అరుణ్‌కుమార్ తెలిపారు. తాను ఊహించిన దానికంటే సుప్రీంకోర్టు ఎంతో మంచి ఉత్త‌ర్వులు ఇచ్చిన‌ట్టు ఆయ‌న వెల్ల‌డించారు. ఈ పిటిష‌న్‌లో  ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వంతో పాటు నాటి విచార‌ణాధికారి కృష్ణంరాజును కూడా పార్టీలుగా చేర్చిన‌ట్టు ఉండ‌వ‌ల్లి చెప్పారు

అయితే  రిజర్వ్ బ్యాంక్ నిబంధనలకు విరుద్ధంగా రామోజీరావు డిపాజిట్లు సేకరించార‌న్నారు. డిపాజిట్లు వెనక్కి ఇచ్చామన్న క్లైమ్‌లో కూడా చాలా తప్పులు ఉన్న‌ట్టు ఆయ‌న తెలిపారు. డిపాజిట్లు వెనక్కి ఇచ్చినని చెప్పినంత మాత్రాన క్రిమినల్ ప్రొసీడింగ్స్ ఆగిపోవని, ఈ కేసుపై ట్రయల్ కోర్టులో నిబంధనల ప్రకారం విచారణ జరగాల‌ని ఉండ‌వ‌ల్లి తెలిపారు. 

దోషిగా తేలితే రెండున్న‌ర రెట్లు జ‌రిమానా

 కేసులో దోషిగా తేలితే, రిజర్వు బ్యాంకు నిబంధనల మేరకు భారీ జరిమానా విధిస్తుందని ఉండ‌వ‌ల్లి తెలిపారు.  వసూలు చేసిన దానికి రెండున్నర రెట్లు జరిమాన (సుమారు 7 వేలకోట్లు) విధించే అవకాశం ఉందన్నారు. దానితో పాటు రెండున్నరేళ్ల పాటు జైలు శిక్ష పడే సూచనలు కనిపిస్తున్నాయని ఆయ‌న‌ తెలిపారు.

ఈ పప్పు నాయుడి గాడికి రాజకీయా బిక్ష పెట్టిందే రాజశేఖర్ రెడ్డి గారు 

వైసీపీ ఎమ్మెల్యే నెవ్వర్ బిఫోర్, ఎవ్వర్ ఆఫ్టర్