విశాఖ సాగర తీరాన మెగా అద్భుతం… ?

అద్భుతాలు కొన్ని ప్రకృతి చేస్తుంది. మరి కొన్ని వాటికి మరింత సొగసులు అద్దేందుకు మనుషులు చేస్తారు. అంటే ప్రభుత్వాలు చేస్తాయి అన్న మాట. విశాఖ సిగలో సరికొత్త  సౌందర్య  కాంతులు చిమ్మేలా ఒక భారీ…

అద్భుతాలు కొన్ని ప్రకృతి చేస్తుంది. మరి కొన్ని వాటికి మరింత సొగసులు అద్దేందుకు మనుషులు చేస్తారు. అంటే ప్రభుత్వాలు చేస్తాయి అన్న మాట. విశాఖ సిగలో సరికొత్త  సౌందర్య  కాంతులు చిమ్మేలా ఒక భారీ కార్యక్రమానికి రూపకల్పన చేసేందుకు ఏపీ సర్కార్ సిద్ధంగా ఉంది.

ఇంతకాలం విశాఖ గురించి చెప్పేవారే తప్ప ఆచరణలో చేసేవారు ఏవరూ లేరు అన్నది పచ్చి నిజం. వైజాగ్ హిస్టరీలో ఫస్ట్ టైమ్ వైసీపీ సర్కార్ విశాఖ అందాలను రెట్టింపు చేసేలా, టూరిజం పరంగా విశాఖకు మణిహారంగా మెగా వీల్ ని ఏర్పాటు చేయబోతోంది.

సరిగా విశాఖ సాగర తీరానికి అభిముఖంగా 15 ఎకరాల్లో ఈ అద్భుతం అతి త్వరలో ఆవిష్కృతం అయ్యేలా శ్రీకారం చుట్టనున్నారు. మెగా వీల్ అంటే లండన్ లో ఐ తరహాలో అని టూరిజం అధికారులు చెబుతున్నారు. అక్కడ ధేమ్స్ నది ఒడ్డున 130 అడుగుల ఎత్తులో ఏర్పాటు చేసిన మెగా వీల్ ప్రపంచ పర్యాటకులకు కనువిందు చేసేదిగా ఉంది.

అదే తరహాలో విశాఖలో కూడా మెగా వీల్ ని 125 అడుగుల ఎత్తున ఏర్పాటు చేయడం ద్వారా వీక్షకులు ఈ మెగా వీల్ ద్వారా యావత్తు విశాఖ అందాలను తనివి తీరా చూసేందుకు అవకాశం కల్పించనున్నారు.  ఈ మెగా వీల్ లో  మొత్తం 44 క్యాబిన్స్ ని ఏర్పాటు చేయనున్నారు. ఒక్కో క్యాబిన్ లో పది మందికి చోటు ఉంటుంది.

అంటే ఒక ట్రిప్ కి మెగా వీల్ ఎక్కిన వారు 440 అవుతారు అన్న మాట. ఇక ఈ క్యాబిన్లను ఫ్లోర్ల నుంచి మొత్తం అంతా గ్లాస్ తోనే రయారు చేయడం వల్ల ఒకసారి అంత ఎత్తుకు వెళ్లిన వారు పైనుంచి దిగువ నుంచి మొత్తానికి మొత్తం వీక్షించి అద్భుతమైన అనుభూతినే పొందుతారు.

ఇక పగలే కాదు, రాత్రులలో కూడా అటు బీచ్ అందాలు, ఇటు నగర సౌందర్యాలను ఒకేసారి తనివి తీరా చూసేందుకు రెండు కళ్ళూ చాలవు అన్నంతగా తీయని అనుభూతిని పొందుతారు అన్న మాట. విశాఖ భీమిలీ వెళ్లే మార్గంలో టూరిజం శాఖ సేకరించిన 15 ఎకరాల్లో మెగా వీల్ ని ఏర్పాటు చేసే కార్యక్రమం తొందరలోనే మొదలవబోతోంది.

అంతే కాదు, ఈ పదిహేను ఎకరాలలో రిక్రియేషన్ కేంద్రాన్ని, షాపింగ్ మాల్స్ ని ఎన్నో రకాల ఎంటర్టైనెమెంట్స్ ని ఏర్పాటు చేయనున్నారు. మొత్తానికి విశాఖ వస్తే అదరహో అనాల్సిందే. మెగా వీల్ ఎక్కితే చాలు విశాఖ మొత్తం కళ్లలోకి వచ్చేసినట్టే. విశాఖలో ఏర్పాటు చేసే మెగా వీల్ ప్రపంచంలోనే టాప్ టెన్ లో ఒకటిగా రూపుదిద్దుకోనుందని అధికారులు తెలియచేస్తున్నారు.