అసెంబ్లీలో పోల’రణం’.. బాబుకి మళ్లీ చాకిరేవు

పోలవరంపై రెచ్చిపోయిన చంద్రబాబుకి భారీ నీటి పారుదల శాఖ మంత్రి అనిల్ అసెంబ్లీలో చాకిరేవు పెట్టారు. అసలు పోలవరంపై చర్చ జరుగుతున్న సమయంలో సభలో ఎందుకున్నామా అనుకునేలా ఫుల్లుగా డోస్ ఇచ్చేశారు.  Advertisement వైఎస్సార్…

పోలవరంపై రెచ్చిపోయిన చంద్రబాబుకి భారీ నీటి పారుదల శాఖ మంత్రి అనిల్ అసెంబ్లీలో చాకిరేవు పెట్టారు. అసలు పోలవరంపై చర్చ జరుగుతున్న సమయంలో సభలో ఎందుకున్నామా అనుకునేలా ఫుల్లుగా డోస్ ఇచ్చేశారు. 

వైఎస్సార్ మరణం తర్వాత పోలవరాన్ని ఎవరూ పట్టించుకోలేదని, 2014లో అధికారంలోకి వచ్చిన బాబు.. రివైజ్డ్ ఎస్టిమేట్లు సమర్పించకుండా కాలయాపన చేశారని గుర్తు చేశారు.

ప్రత్యేక ప్యాకేజీ కోసం హోదాను తాకట్టు పెట్టిన బాబు.. పనిలో పనిగా పోలవరాన్ని కూడా తాకట్టు పెట్టేశారని అన్నారు. పోలవరం ఇరిగేషన్ కాంపౌండ్ కు కేంద్రం నిధులు ఇస్తామన్నా కూడా చంద్రబాబు అంగీకరించకుండా.. ప్రాజెక్ట్ నిర్మాణాన్ని తమ చేతుల్లోకి తీసుకుని ప్యాకేజీల కోసం రాష్ట్ర భవిష్యత్తుని నాశనం చేశారని, పోలవరం పూర్తి కాకుండా వదిలిపెట్టారని అన్నారు.

గత ఐదేళ్లలో చంద్రబాబు కనీసం 20శాతం పోలవరం పనులు కూడా పుర్తి చేయలేదని, ప్రధాన మంత్రికి సైతం అబద్ధాల లెటర్లు రాస్తున్నారని మండిపడ్డారు. సాక్షాత్తూ ప్రధాని మోదీ.. పోలవరం నిర్మాణం విషయంలో చంద్రబాబుపై ఆరోపణలు చేశారని, పోలవరాన్ని బాబు ఏటీఎంలా మార్చుకున్నారని చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు అనిల్.

పోలవరం ముంపు ప్రాంతాల్లో 18వేల కుటుంబాలు ఆశ్రయం కోల్పోతున్నా.. బాబు పట్టించుకోలేదని, వైసీపీ అధికారంలోకి వచ్చాక ఆర్అండ్ఆర్ ప్యాకేజీ కింద రెట్టింపు నిధులు చెల్లించి మరీ నాణ్యమైన ఇళ్లు నిర్మించి 1,75,500 కుటుంబాలకు పునరావాసం కల్పించామని చెప్పారు. 

2021 డిసెంబర్ నాటికి పోలవరం పూర్తి చేస్తామని, ఎలాంటి అనుమానాలు పెట్టుకోవద్దని, మిల్లీ మీటర్ ఎత్తు కూడా తగ్గించేది లేదని, పోలవరం ప్రారంభోత్సవానికి చంద్రబాబు సహా టీడీపీ నేతలకు ఆహ్వానం పంపిస్తామని అన్నారు.

బాబు చేసిన తప్పుల్ని సరిద్దుకోడానికి తమకు ఇప్పటి వరకూ సమయం పట్టిందని చెప్పారు అనిల్. పోలవరం నిధుల విషయంలో ప్రధానికి సీఎం జగన్ లేఖ రాశారని, పీపీఏ అథారిటీలో కూడా సవరించిన అంచనాలపై తాము వాదనలు వినిపించామన్నారు.

మొత్తమ్మీద పోలవరంపై జరిగిన చర్చలో చంద్రబాబు పరువుతీశారు మంత్రి. 80 శాతం పూర్తి చేశామని చెప్పుకుంటున్న బాబు.. 20 శాతం పనులు కూడా చేయలేదని, అప్పుడు వైఎస్ఆర్ ప్రాజెక్ట్ పనుల్ని పరుగులు పెట్టిస్తే.. ఇప్పుడు జగన్ హయాంలో ప్రాజెక్ట్ పూర్తి చేస్తున్నామని స్పష్టం చేశారు.

పనిలో పనిగా బాబు కరపత్రిక ఈనాడుపై కూడా విమర్శలు గుప్పించారు. మద్రాసు వీధుల్లో బజ్జీల బండి దగ్గర చిత్తు కాగితానికి కూడా ఈనాడు పనికిరాదన్నారు.