మంత్రి హరీష్ రావుకు కరోనా

తెలంగాణ మంత్రివర్గంలో ఇప్పటికే కొందరు కరోనా బారిన పడ్డారు. ఇప్పుడీ లిస్ట్ లోకి కీలక మంత్రి హరీష్ రావు కూడా చేరారు. అవును.. హరీష్ రావుకు కరోనా సోకింది. ఈ విషయాన్ని ఆయన స్వయంగా…

తెలంగాణ మంత్రివర్గంలో ఇప్పటికే కొందరు కరోనా బారిన పడ్డారు. ఇప్పుడీ లిస్ట్ లోకి కీలక మంత్రి హరీష్ రావు కూడా చేరారు. అవును.. హరీష్ రావుకు కరోనా సోకింది. ఈ విషయాన్ని ఆయన స్వయంగా వెల్లడించారు.

“స్వల్పంగా కరోనా లక్షణాలు కనిపించాయి. పరీక్షలు చేయించుకుంటే కరోనా పాజిటివ్ తేలింది. నేను ఆరోగ్యంగానే ఉన్నాను. ఈ మధ్యకాలంలో నాతో టచ్ లోకి వచ్చిన వాళ్లంతా ఐసొలేషన్ లోకి వెళ్లాలని, కరోనా పరీక్షలు చేయించుకోవాలని కోరుతున్నాను.”

ఇలా తనకు పాజిటివ్ వచ్చిన విషయం బయటపెట్టారు హరీష్ రావు. త్వరలోనే తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలకు హరీష్ రావు దూరమయ్యారు.

ఇప్పటికే తెలంగాణలో పలువురు మంత్రులు కరోనా బారిన పడ్డారు. ఏకంగా హోం మంత్రి మహమూద్ అలీ కరోనా బారిన పడగా.. మంత్రి మల్లారెడ్డితో పాటు మరికొందరు ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు కూడా కరోనాను ఎదుర్కొనాల్సి వచ్చింది. ఇప్పుడీ లిస్ట్ లోకి హరీష్ రావు కూడా చేరారు.

గడిచిన 24 గంటల్లో తెలంగాణలో 2511 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య లక్షా 38వేల 395కు చేరుకుంది.

అమెరికాలో అందగాడు