నాగార్జున ఎప్పుడో 60 దాటేశారు. తనకు షష్ఠిపూర్తి అయిందనే విషయాన్ని నాగ్ ఒప్పుకోడు. ఎప్పుడూ యంగ్ గా కనిపించేందుకు తహతహలాడతారు. మన్మథుడు ట్యాగ్ లైన్ ను ఇష్టపడతారు. ఇలాంటి నాగార్జున తొలిసారి తనకు వయసు అయిపోయిందని ఒప్పుకున్నారు. దానికి కారణం స్పోర్ట్స్ బేస్డ్ సినిమాలు.
నాగార్జునకు స్పోర్ట్స్ అంటే ఇష్టమే. కానీ కెరీర్ లో ఇప్పటివరకు క్రీడా నేపథ్యం ఉన్న సినిమాలో ఆయన నటించలేదు. తను వయసులో ఉన్నప్పుడు అలాంటి కథలు నా దగ్గరకు రాలేదని, ఇప్పుడేమో తనకు వయసైపోయిందని అంటున్నారు నాగ్.
“నేను యంగ్ గా ఉన్నప్పుడు పెద్దగా స్పోర్ట్స్ సినిమాలు రాలేదు. మేకర్స్ కూడా ఆ దిశగా ఆలోచించలేదు లగాన్ నుంచి ఇది మొదలైంది. ఆ తర్వాత మెల్లగా సౌత్ ఇండస్ట్రీకి పాకింది. సౌత్ లో ఇప్పుడిప్పుడే ఈ జానర్ లో సినిమాలొస్తున్నాయి. కానీ ఇప్పటికే ఆలస్యమైపోయింది. స్టోర్ట్స్ జానర్ లో సినిమా ప్రయత్నించే వయసు కాదు నాది.”
రొమాంటిక్ సినిమాల నుంచి డివోషనల్ మూవీస్ వరకు ఎన్నో జానర్స్ టచ్ చేసిన నాగార్జున, స్పోర్ట్స్ జానర్ లో సినిమా చేయలేకపోయినందుకు బాధపడ్డాడు. భవిష్యత్తులో కూడా తనకు ఆ అవకాశం లేదని, కొన్ని జానర్లు అంతే అని తేల్చేశారు. ప్రస్తుతం ఈ హీరో బంగార్రాజు సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నారు. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఓ యాక్షన్ మూవీ చేస్తున్నారు.