నారా లోకేష్‌కి అంత భయమెందుకు.?

సుజనా చౌదరిని విమర్శించడానికి నారా లోకేష్‌ భయపడిపోతున్నట్లున్నారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి హోదాలో నారా లోకేష్‌ అన్ని విషయాలపైనా మాట్లాడాల్సి వుంటుంది. Advertisement పైగా, టీడీపీని వీడి.. బీజేపీలో చేరిన సుజనా చౌదరి,…

సుజనా చౌదరిని విమర్శించడానికి నారా లోకేష్‌ భయపడిపోతున్నట్లున్నారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి హోదాలో నారా లోకేష్‌ అన్ని విషయాలపైనా మాట్లాడాల్సి వుంటుంది.

పైగా, టీడీపీని వీడి.. బీజేపీలో చేరిన సుజనా చౌదరి, తెలుగుదేశం పార్టీ త్వరలో ఖాళీ అయిపోతుందంటూ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారాయె. ఈ విషయమై నారా లోకేష్‌ని ప్రశ్నిస్తే, 'సుజనా చౌదరి వ్యాఖ్యలపై నేను మాట్లాడను' అని తేల్చి చెప్పేశారు.

నారా లోకేష్‌కి సుజనా చౌదరి మీద మాట్లాడేందుకు ధైర్యం లేదుగానీ, టీడీపీని వీడి వైసీపీలోకి వెళ్ళబోతున్న వల్లభనేని వంశీ మోహన్‌ టీడీపీ మీద చేస్తున్న విమర్శలపై మాత్రం మండిపడిపోతారు ఈ 'చినబాబు'.

అంటే, ఇక్కడ మేటర్‌ క్లియర్‌.. ఇంకా సుజనా చౌదరి, తెలుగుదేశం పార్టీతో టచ్‌లోనే వున్నారు. బీజేపీలోకి వెళ్ళినా, తెలుగుదేశం పార్టీ కోసమే పనిచేస్తున్నారు సుజనా చౌదరి.

అన్నట్టు, ఈరోజు ఓ ఛానల్‌ డిస్కషన్‌ సందర్భంగా సుజనా చౌదరిపై వైసీపీ నేత రవిచంద్రారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సుజనా చౌదరి, బీజేపీలో మంచి పదవి కోసం ప్రయత్నిస్తున్నారనీ.. ఆయన చెబుతున్నట్లు టీడీపీ నుంచి 20 మంది ఎమ్మెల్యేలు బీజేపీలో చేరితే, 21వ ఎమ్మెల్యేగా చంద్రబాబు కూడా బీజేపీలోకి వెళ్ళిపోయి.. అక్కడా సుజనా చౌదరికి చంద్రబాబే బాస్‌ అవుతారనీ రవిచంద్రా రెడ్డి ఎద్దేవా చేశారు.

ఇదేదో సాధారణ విమర్శలా అన్పించడంలేదు.. ఏమో, భవిష్యత్తులో అదే జరుగుతుందేమో. అందుకే, సుజనా చౌదరిని విమర్శించేందుకు నారా లోకేష్‌ మొహమాటపడుతున్నారేమో.!

టీడీపీ మీద వైసీపీ విమర్శలు చేసిన వెంటనే, చినబాబు సోషల్‌ మీడియా వేదికగా అయినా చెలరేగిపోతుంటారు. అలాంటిది సుజనా చౌదరి సహా నలుగురు రాజ్యసభ సభ్యులు టీడీపీని వీడి బీజేపీలో చేరితే, నారా లోకేష్‌కి నోరు పెగలకపోడం ఆశ్చర్యకరమే. పైగా, 'కుటుంబ పాలన..' అంటూ సుజనా చౌదరి 'నొక్కి వక్కాణించినా' చినబాబుకి పౌరుషం రాకపోవడాన్ని ఏమనుకోవాలి.?